వేడుకలు రెండ్రోజులు వైన్స్, బార్లు బంద్‌

1 Mar, 2018 08:29 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హోలీ వేడుకలు నగరంలో రెండు రోజులు జరగనున్నాయి. రాజ్‌భవన్‌లో గురువారం వేడుకలు నిర్వహించనుండగా... రవీంద్రభారతి, ఇందిరాపార్కు, నెక్లెస్‌ రోడ్, లలిత కళాతోరణం, మాదాపూర్‌ ఇమేజ్‌ గార్డెన్స్, శిల్పారామం తదితర ప్రాంతాల్లో శుక్రవారం నిర్వహించనున్నారు. సిటీలో హోలీ పండగకే కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే మార్వాడీలు, రాజస్థాన్‌ వాసులు శుక్రవారమే హోలీ ఆడాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం 6గంటల నుంచి శనివారం ఉదయం 6గంటల వరకు నగరంలో వైన్స్, బార్లు పూర్తిగా బంద్‌ చేయాలని పోలీసులు ఆదేశాలిచ్చారు.

రాజేంద్రనగర్‌: రంగుల పండగకురంగం సిద్ధమైంది. కలర్‌ఫుల్‌ఈవెంట్‌లో ఆడిపాడేందుకు సిటీసన్నద్ధమైంది. కానీ.. రసాయనరంగులతో ఎన్నో అనర్థాలు పొంచి ఉన్న నేపథ్యంలో సహజ రంగులతోనే హోలీ ఆడుకోవాలని నిపుణులుసూచిస్తున్నారు. సిటీజనుల్లోనూఈ స్పృహ పెరిగింది. ప్రకృతి సిద్ధంగా తయారైన రంగులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకనుగుణంగానే ప్రొఫెసర్‌
జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయవిశ్వవిద్యాలయం పరిధిలోని హోమ్‌సైన్స్‌ కళాశాల సహజ రంగులు సిద్ధం చేసింది. గతేడాది 4టన్నులు తయారు చేయగా, ఈ ఏడాది 7టన్నులుఅందుబాటులో ఉంచింది.  

రంగులు లభించే ప్రాంతాలు..    
సైఫాబాద్‌ హోమ్‌సైన్స్‌ కళాశాల, రాజేంద్రనగర్‌లోని తయారీ యూనిట్, లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని రామకృష్ణ మఠం, ఎమరాల్డ్‌ స్వీట్‌ హౌస్, హైదర్‌నగర్‌లోని 24మంత్ర ఆర్గానిక్‌ షాప్‌ తదితర ప్రాంతాల్లో వీటిని విక్రయించనున్నారు. 

కిలో రూ.400  
హోమ్‌సైన్స్‌ కళాశాల ఆధ్వర్యంలో ఐదు రకాల రంగులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరెంజ్, ఎల్లో, బ్లూ, గ్రీన్, పింక్‌ కలర్లు ఉన్నాయి. కిలో రంగును రూ.400 విక్రయిస్తున్నారు. పావు కిలో, అర్ధ కిలో, కిలో చొప్పున ప్యాకింగ్‌లు కూడా చేశారు. మరిన్ని వివరాలకు: 7032823265, 7331175251, 040–23244058.

 పెరుగుతున్న డిమాండ్‌..  
ప్రకృతి సిద్ధంగా తయారు చేస్తున్న రంగులపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి ఏడాది రంగుల ఉత్పత్తి పెరుగుతోంది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా రంగులను తయారు చేస్తున్నాం. మార్కెట్‌లో విక్రయించేందుకు కొన్ని స్టాల్స్‌ ఏర్పాటు చేశాం.   – గీతారెడ్డి, సహజ రంగుల ప్రాజెక్ట్‌ ప్రిన్సిపల్, హోమ్‌సైన్స్‌ కాలేజీ

ఉపయోగాలు...  
ఈ రంగుల్లో ఎలాంటి రసాయనాలు ఉండవు.  
శరీరానికి, కళ్లకు ఎలాంటి హానీ చేయవు.  
పర్యావరణంపై ప్రభావం చూపవు.  
శుభ్రపరుచుకోవడం చాలా తేలిక.  
నీరు ఆదా అవుతుంది.. ఖర్చు తక్కువ.   
భూమిలో ఈ రంగుల నీరు ఇంకడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు.   

ఇక వాడం..  
సహజ రంగులతోనే హోలీ ఆడాలని నిర్ణయించాం. ఇక నుంచి రసాయన రంగులు వాడం. రాజేంద్రనగర్‌లోని తయారీ యూనిట్‌లో రంగులు కొనుగోలు చేశాం.   –  కె.వనజ, హైదర్‌గూడ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా