సమ్మె స్ఫూర్తితో హక్కుల సాధన

14 Sep, 2015 03:49 IST|Sakshi
సమ్మె స్ఫూర్తితో హక్కుల సాధన

- రౌండ్ టేబుల్ సమావేశంలో వ క్తలు
- హాజరైన ఎమ్మెల్యే దివాకర్‌రావు, టీబీజీకేఎస్, జేఏసీ నేతలు
శ్రీరాంపూర్ :
తెలంగాణ ఏర్పాటుకోసం చేసిన సకల జనుల సమ్మె పోరాట స్ఫూర్తితో సింగరేణి కార్మికుల హక్కులను సాధించుకుందామని వక్తలు పిలుపునిచ్చారు. సకల జనుల సమ్మె జరిగి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్‌లోని ప్రగతి మైదానం సీఈఆర్ క్లబ్‌లో ఆదివారం రౌండ్ టేబుల్ సమావే శం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మె ల్యే దివాకర్‌రావు, టీబీజీకేఎస్ మాజీ అధ్యక్షుడు కెంగర్ల మ ల్లయ్య, సింగరేణి జేఏసీ చైర్మన్ ఎండీ.మునీర్, ఎంపీపీ బేర సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.

తొలుత తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. అనంతరం వక్తలు సకల జనుల సమ్మెలో కార్మికుల పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఈ మేరకు నాటి సమ్మె స్ఫూర్తితో.. ప్రస్తుతం హక్కుల సాధన, సదుపాలు, ఉద్యోగాల కోసం పోరాడాలని వారు కార్మికులకు పిలుపునిచ్చారు. సమావేశంలో నూనె మల్లయ్య, దమ్మాల శ్రీనివాస్‌తో పాటు పలువురు కళాకారులు తమ పాటలతో ఆకట్టుకున్నారు.
 
సీఎం దృష్టికి సింగరేణి సమస్యలు..
సింగరేణి కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్.దివాకర్‌రావు తెలిపా రు. అలాగే, శ్రీరాంపూర్‌లో సకల జనుల సమ్మె స్మృతి చిహ్నం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కాగా, కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని పేర్కొన్నా రు. పలు తీర్మానాలను ఆమోదించిన ఈ సమావేశంలో శ్రీరాంపూర్ జేఏసీ కన్వీనర్ గోషిక మల్లేష్, సర్పంచ్ ఎం.రాజేంద్రపాణి, టీబీజీకేఎస్ నాయకులు పెద్దపల్లి కోటిలింగం, బంటు సారయ్య, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి, జిల్లా  కార్యదర్శి వేల్పుల రవీందర్, నాయకులు కానుగంటి చంద్రయ్య, ముస్కె సమ్మయ్య, చిలువేరు సదానందం, జావేద్, ఏ.కిషన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు