హైకోర్టు విభజనతోనే తెలంగాణకు న్యాయం

27 Jul, 2015 04:34 IST|Sakshi
హైకోర్టు విభజనతోనే తెలంగాణకు న్యాయం

- కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్
కాజీపేట:
ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజనతోనే తెలంగాణ ప్రజలు సార్వభౌమత్వాన్ని అనుభవించగలుగుతారని కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. కాజీపేట తారాగార్డెన్ కాళోజీ ప్రాంగాణంలోని ఆచార్య బియాల జనార్ధన్ హాల్‌లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వేదికపై ఆదివారం తెలంగాణ వికాస సమితి ప్రథమ వార్షికోత్సం జరగింది.

సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నో పోరాటాల ఫలితంగా దక్కిన రాష్ట్ర ఆవిర్భా ఉత్సవం కొంతమంది కారణంగా తెలంగాణ వాసులకు దక్కకుండా పోతుందన్నారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ ప్రాంతానికి ఏదో నష్టం జరిగిపోతుందని సీమాంధ్ర పాలకులు చేసిన వ్యాఖ్యలు తప్పని ఏడాది టీఆర్‌ఎస్ పాలన నిరూపించిందని అన్నారు.

తెలంగాణ ఏర్పాటు ప్రజల ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనమని, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం కాకుండా చూడడం తెలంగాణ వాదులకు నైతికవిజమని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన హైకోర్టు విభజన జరుపకపోవడంతో రెండు రాష్ట్రాల ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని.. దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని కోరారు. హైకోర్టులు స్థానికంగా ఉండాలని ప్రజలు కోరుకోవడం ఒక హక్కు అని అన్నారు. 

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసిఆర్ చేస్తున్న కృషికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. జిల్లా పరిషత్ చెర్మైన్ గద్దెల పద్మ మాట్లాడుతు అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్య అందరిపై ఉందన్నారు. సభ అధ్యక్షుడు, వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు భౌతికంగా విడిపోయాయే తప్ప మనుసులు ఎప్పటికి కలిసి ఉంటాయని అన్నారు.

కవి, రచయిత నందిని సీదారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర పాలకులు కుట్రలు, కుతంత్రాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రముఖ కవి, ఒంగోలు జిల్లా వాసి డాక్టర్ కోయి కోటేశ్వర్‌రావు తెలంగాణ ఉద్యమం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని అన్నారు. కార్యక్రమంలో వికాస సమితి జిల్లా అధ్యక్షుడు జి.చంద్రశేఖర్, రాష్ట్ర టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, సమన్వయకర్త డాక్టర్ ఎ.శ్రీధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, డాక్టర్ బ్రహ్మం, ప్రొఫెసర్ వినయ్‌బాబు, పరాంకుషం, వేణుగోపాలస్వామి పాల్గొన్నారు. సమావేశంలో తెలంగాణ కవులు, కళాకారులు వేదికపై చేసిన ఆట, పాటలు సభికులను ఆకట్టుకున్నాయి.

మరిన్ని వార్తలు