వాట్సప్‌తో జాగ్రత్త

26 Aug, 2015 23:45 IST|Sakshi
వాట్సప్‌తో జాగ్రత్త

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
- ఫొటో అప్‌లోడ్‌పై అజాగ్రత్త వద్దు
- నిబంధనలు తెలియని యాప్‌లు డౌన్‌లోడ్ చేయకండి
- అపరిచితుల సందేహాలకు సమాధానం ఇవ్వొద్దు.
- యాంటీ హ్యాకింగ్ సాప్ట్‌వేర్‌ను మొబైల్‌లో ఉంచుకోండి.
- ఫ్యామిలీ పర్యటనల వివరాలు, లొకేషన్ షేరింగ్ చేయకండి.
- పరిచయం, నమ్మకం లేని వ్యక్తులతో షేరింగ్ చేయవద్దు
- పిల్లల ఫోటోలు వారి వివరాలను ఇతరులతో షేరింగ్ చేయడమూ ప్రమాదమే.
- ఎక్కువ మంది లింక్ అయ్యారని అపరిచిత వ్యక్తులతో షేర్ ఇవ్వవద్దు.
- ఎంత పరిచయం ఉన్న వారైనా వారిని మిత్రులుగా ఒప్పుకునే ముందు వారి జాబితాలో ఎవరున్నారు. ఎలాంటి వారున్నారు. అనే విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి

పటాన్‌చెరు :
ప్రస్తుతం ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్‌ఫోన్లే కనిపిస్తున్నాయి. వాట్సప్‌ల వినియోగం ఎక్కువైంది. వీటి వల్ల ప్రయోజనం ఎంతుందో ప్రమాదం కూడా అంతే ఉంది. వీటిని ఉపయోగించి నేరాలకు పాల్పడే వారి సంఖ్య చాలా పెరిగింది. సర్వీస్ ప్రొవైడర్లతో సంబంధం లేకుండా ఇంటర్‌నెట్ సాయంతో పని చేసే తక్షణ సమాచార వ్యవస్థ వాట్సప్‌. వీటిలో వీడియోలు, మెసేజ్‌లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పంపుకునే సౌలభ్యం ఉండడంతో పాటు ఎటువంటి చార్జీలు లేకపోవడంతో అందరూ అధికంగా వాడుతున్నారు. రోజుకు వాట్స్‌ప్‌ల నుంచి కోట్లలో మేసేజ్‌లు, ఫొటోలు వెళ్తున్నట్లు సర్వేలలో వెల్లడవుతోంది. ఈ నేపథ్యంలో వాట ్సప్‌ల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
 
ఇలా జరిగితే..
మనం ఎక్కడో సరదాగా తీసుకున్న వ్యక్తిగత ఫొటోను స్నేహితుల కోసం షేర్ చేస్తే దానిని మన ప్రమేయం లేకుండా ఇతరులు చూసే ఆస్కారం ఉంది. ఆ ఫోటోను మార్ఫింగ్ చేసే ప్రమాదమూ లేకపోలేదు. అందుకు వాట్సప్‌లో వ్యక్తిగత సమాచారం,  ఫొటోలను స్నేహితులకు షేర్ చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే లొకేషన్ షేరింగ్ కూడా మన భద్రతకు ముప్పు తెస్తోందని, దీనివల్ల మనం ఎక్కడున్నామో అగంతకులకు ఇట్టే తెలిసిపోతుందని హెచ్చరిస్తున్నారు.
 
డౌన్‌లోడ్‌లోనూ..  
కాలపరిమితితో ఉచితంగా అందుబాటులోకి వచ్చిన గుగూల్ వాట్సప్, వైబర్, వీచాట్ వంటికి అనేకం అందుబాటులోకి వచ్చాయి. వీటిని డౌన్‌లోడ్ చేసుకునే ముందు దాని ఆప్షన్లు నిబంధనలు పూర్తిగా చదివి అప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది. అలా కాకుండా ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ అయ్యే యాప్ వల్ల మన ఫొటోలు మార్ఫింగ్ అయ్యే ప్రమాదముంది.

మరిన్ని వార్తలు