‘చెప్పుతో కొడతా.. ఎవరికీ భయపడను’

25 Feb, 2019 17:05 IST|Sakshi

సాక్షి, గజ్వేల్‌: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగుల పట్ల మహిళా అటెండర్‌ దురుసుగా ప్రవర్తించిన ఘటన సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో చోటుచేసుకుంది. వైద్యం కోసం వచ్చిన వారిని దూషిస్తూ దాడి దిగింది స్వరూప అనే మహిళా అటెండర్‌. అక్కడితో ఆగకుండా చెప్పుతో కొడతానని హెచ్చరించింది. ఎవరికి చెపుకుంటారో, చెప్పుకోండి అంటూ ఎదురుదాడికి దిగింది. తన మాటలను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినా భయపడబోనని హుంకరించింది.

ఆమెపై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద స్పందించారు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. పోలీస్‌ కేసు కాకుండా చూసేందుకు బాధితులను ఆస్పత్రి నుంచి పంపించివేశారు. మీడియాకు ఏమీ తెలపొద్దని చెప్పినట్టు తెలుస్తోంది. రోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన మహిళా అటెండర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు