తల్లడిల్లిన తల్లిగుండె

23 Jan, 2018 11:55 IST|Sakshi

బిడ్డతో సహా తల్లి ఆత్మహత్య

బిడ్డల అనారోగ్యంతో మనస్తాపం

కుమార్తెతో సహా భవనంపై నుంచి దూకి ఆత్మహత్య

బిడ్డల అనారోగ్యంతో కలత చెందిన కన్న తల్లి.. ఓ పాపతో సహా బిల్డింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన చందానగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. తల్లి స్వాతితో పాటు తొమ్మిది నెలల పాప శాన్వీ కూడా మృతి చెందడం స్థానికులను కలచివేసింది.  

చందానగర్‌: పుట్టిన ఇద్దరు చిన్నారులు తరచూ ఆనారోగ్యానికి గురవుతుండడంతో కలత చెందిన ఓ తల్లి తొమ్మిది నెలల చిన్నారితో సహా భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వేణుకుమార్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లా, హుజురాబాద్‌కు చెందిన ప్రదీప్‌కుమార్, స్వాతి (30) దంపతులు. సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రదీప్‌ కుమార్‌ కుటుంబంతో సమా చందానగర్‌ కేఎస్‌ఆర్‌ ఎన్‌క్లేవ్‌లోని సాయిపెరల్‌ రెసిడెన్సీలో ఉంటున్నాడు.

సాయిపెరల్‌ రెసిడెన్సీ ,తల్లీబిడ్డల మృతదేహాలు
వీరికి కుమారుడు అరుశురాం(5), శాన్వీ (9 నెలలు) ఉన్నారు. చిన్నారులిద్దరూ తరచూ అనారోగ్యంతో బాధపడుతుండటంతో స్వాతి మానసికంగా బాధపడుతుండేది. అరుశురాం అమ్మమ్మ ఇంట్లో ఉన్నాడు. సోమవారం ఉదయం స్వాతి, చిన్నారి శాన్విని తీసుకొని తమ అపార్ట్‌మెంట్‌ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గుర్తించిన స్థానికులు బాధితులను మదీనాగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం  మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘గురుకులం’ ఖాళీ!

ఈ ఉపాధ్యాయుడు అందరికీ ఆదర్శవంతుడు 

‘ఎస్‌ఐ రేణుక భూమి వద్దకు వెళ్లకుండా బెదిరిస్తుంది’

గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

చాలా మంది టచ్‌లో ఉన్నారు..

‘ఆలంబాగ్‌’ ఏమైనట్టు!

ఇంటికే మొక్క

‘క్యాష్‌లెస్‌’ సేవలు

కాంగ్రెస్‌ టు బీజేపీ.. వయా టీడీపీ, టీఆర్‌ఎస్‌

ప్రియుడి చేత భర్తను చంపించిన భార్య

పరిమళించిన మానవత్వం

ఆశల పల్లకిలో ‘కొత్తపల్లి’

ఒకే రోజులో ట్రిపుల్‌ సెంచరీ

ట్రిబుల్‌..ట్రబుల్‌

పెబ్బేరులో మాయలేడి..!

వైఎంసీఏలో ఫుడ్‌ పాయిజన్‌

పూడ్చిన శవాలను కాల్చేందుకు యత్నం 

పల్లె కన్నీరుపెడుతుందో..

చచ్చినా చావే..!

మళ్లీ ‘స్వైన్‌’ సైరన్‌!

కేన్సర్‌ ఔషధాల ధరల తగ్గింపు!

ఎంసెట్‌ స్కాంలో ఎట్టకేలకు చార్జిషీట్‌

యాప్‌ టికెట్‌.. టాప్‌

చెరువుల పరిరక్షణకు ముందుకు రావాలి

విన్‌.. సోషల్‌ ప్రొటీన్‌

అమల్లోకి ప్రైవేటు వర్సిటీల చట్టం

కళాత్మక దంపతులు

హీరా కుంభకోణంపై దర్యాప్తు ఇలాగేనా?

టిక్‌టాక్‌ చేసిన సిబ్బందిపై చర్యలు

దేశవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం

వసూళ్లు పెరిగాయి

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు