చైతన్యపురిలో దారుణం

11 Dec, 2017 13:53 IST|Sakshi

అత్తింటి వేధింపులతో మహిళ ఆత్మహత్య

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని చైతన్యపురిలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఓ వివాహిత సోమవారం ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. చైతన్యపురిలో ఉండే లావణ్య అనే మహిళ ఈ రోజు ఉరేసుకుని బలవన్మరణం చేసుకుంది. అత్తింటి వేధింపులే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. కాగా వరకట్నం కోసం లావణ్యను అత్తింటి వారు వేధించారని.. ఈ క్రమంలోనే ఆమె ఈ అఘాయిత్యం చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా