వివాహిత ఆత్మహత్య

8 Feb, 2015 16:27 IST|Sakshi

ఆదిలాబాద్: భర్త నెల క్రితం చనిపోయాడు.  భర్త లేని ఒంటరి జీవితాన్ని భరించలేక ఓ యువతి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. రెండు నెలల పసిపాపను ఒంటరిని చేసి వెళ్లిపోయింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని తానూరు మండల కేంద్రంలో ఆదివారం ఉదయం జరిగింది. తానూరుకు చెందిన మంజు (22)కు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్‌కు చెందిన యువకునితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. గతేడాది డిసెంబర్ 31న మంజు భర్త మృతి చెందాడు. దాంతో మంజు  శిశువుతో కలసి వచ్చి తానూరులోని తల్లీదండ్రులు లాల, భారత్‌బాయి వద్ద ఉంటోంది. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

(తానూర్)

మరిన్ని వార్తలు