అడ్డొస్తోందని.. అంతమొందించాడు..!

24 May, 2015 00:22 IST|Sakshi

 హుజూర్‌నగర్: భర్తను కోల్పోయి తల్లిగారింటి వద్దే ఆశ్రయం పొందుతున్న మహిళతో పరిచయం పెం చుకున్నాడు.. అదికాస్త ప్రేమకు దారి తీయడం తో రెండున్నరేళ్లు కలిసి తిరిగారు..చివరకు తల్లిదండ్రు లు కుదిర్చిన యువతితో వివాహం చేసుకున్నా డు.. ఇది తెలిసి నా సంగతేంటని నిలదీసిన మహిళను దారుణంగా ఉరివేసి అంతమొందించాడు.. గరిడేపల్లి మండలం గారకుంటతండాలో ఈ నెల 20న వెలుగుచూసిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదిం చారు.
 
 ప్రియుడే ఈ ఘాతునికానికి ఒడిగట్టాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. శనివారం స్థా నిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో సీఐ సురేందర్‌రెడ్డి నిందితుడి వివరాలు, హత్యోదంతానికి గల కారణాలను వివరించారు. నేరేడుచర్ల మండలం కందులవారిగూడెం గ్రామానికి చెందిన పిల్లుట్ల లక్ష్మికి 8 ఏళ్ల క్రితం త్రిపురారం మండలం బాబుసాయిపేటకు చెందిన ఉల్లెందుల నాగయ్యతో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు జన్మించాడు. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో నాగయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో లక్ష్మి కు మారుడిని అత్తగారి ఇంటి వద్దే వదిలి తల్లిదండ్రుల స్వగ్రామమైన కందులవారిగూడెంలో ఉంటుంది.
 
 పరిచయం ప్రేమగా మారి..
 లక్ష్మి మిర్యాలగూడలోని ఒక కళాశాలలో డిగ్రీ విద్యను కొనసాగిస్తూ సెలవు దినాలలో కూలికి వెళుతోంది. ఈ క్రమంలో నేరేడుచర్ల మండలం దిర్శించర్లకు చెందిన అవివాహితుడు షేక్ యాకూబ్‌తో పరిచయం ఏర్పడింది. సుమారు రెండున్నర సంవత్సరాల నుంచి కలిసి తిరిగారు. అయితే ఇటీవల  యాకూబ్ తల్లిదండ్రులు కుదిర్చిన మరో యువతిని వివాహం చేసుకున్నాడు.
 
 బెదిరిస్తోందని..
 యాకూబ్ మరో యువతిని వివాహం చేసుకుంటున్నప్పటి నుంచి లక్ష్మిని దూరంగా పెట్టాడు. ఇది జీర్ణించుకోలేని లక్ష్మి నా సంగతేంటని యాకూబ్‌ను నిలదీసింది. భార్యను వదిలి నాతో ఉండాలని.. లేకుంటూ నీ పేరు మీద ఉత్తరం రాసి చనిపోతానని బెదిరించసాగింది.
 
 అడ్డుతొలగించుకోవాలని..
 తన జీవితానికి అడ్డుగా నిలిచిన లక్ష్మి అడ్డును ఎలాగైనా తొలగించుకోవాలని యాకూబ్ నిర్ణయించుకున్నాడు. ఈ నెల 20వ తేదీన లక్ష్మికి ఫోన్ చేశాడు. ఇద్దరు కలిసి బైక్‌పై గారకుంటతండా సమీపంలో గల మామిడి చెట్టు వద్దకు చేరుకున్నారు. అక్కడే మద్యం సేవిస్తూ మాట్లాడుకున్నారు. ఆపై మామిడి చెట్టు ఎక్కి కూర్చున్నారు. కాసేపటికి కిందికి దిగేం దుకు వీలుగా ఉంటుందని లక్ష్మిచున్నీ చెట్టుకొమ్మకు కట్టాడు. అదే సమయంలో చున్నీ మరోవైపున ముడి వేసి లక్ష్మి మెడకు వేసి కిందకు తోసేసాడు. దీంతో ఊపిరి ఆడక లక్ష్మి చనిపోయింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు లక్ష్మి ఫోన్‌కాల్స్ లిస్ట్ ఆధారంగా యాకూబ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడని సీఐ వివరించారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చినట్టు సీఐ తెలిపారు. సమావేశంలో గరిడేపల్లి ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు