మొక్కకు చీర రక్ష

19 May, 2018 08:48 IST|Sakshi

బోధన్‌ : ఆకుపచ్చ తెలంగాణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారంలో భాగంగా బోధన్‌ మున్సిపల్‌ శాఖ పట్టణంలోని ప్రధాన రోడ్లలో మొక్కలు నాటారు. పట్టణ కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా నుంచి రైల్వేగేట్‌ మీదుగా బాన్సువాడ వెళ్లే ప్రధాన రోడ్డులో లయన్స్‌ కంటి ఆస్పత్రి, రాకాసీపేట్‌ రైల్వేస్టేషన్, రాకాసీపేట్‌ ప్రాంత క్రాసింగ్‌ కూడలి వద్ద ప్రధాన రోడ్డుకు ఆనుకుని మొక్కలు నాటా రు. ఇక్కడ రోడ్డు పక్కన చిరు టీ, టిఫిన్‌ హోట ల్‌ నడుపుకుంటున్న వహీదా అనే మహిళ హో టల్‌ ముందు నాటిన మొక్క మేకలు తినేయకుండా, మొక్క చుట్టూ చీరలు కట్టి సంరక్షిస్తోంది. ఇలా ప్రతి ఒక్కరూ మొక్కల సంరక్షణను బాధ్యతగా తీసుకుంటే హరిత తెలంగాణ కల సాకారం అవుతోందనడంలో సందేహంలేదు.   

మరిన్ని వార్తలు