మురికి గుంతలో 48 గంటలుగా..

7 Sep, 2019 19:32 IST|Sakshi
పైప్‌లైన్‌ గుంతలో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న అరుణ   

సాక్షి, హైదరాబాద్‌ : కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా మురికి కాల్వలు, మ్యాన్‌ హోళ్లు నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ వినూత్న నిరసనకు దిగారు. ఏకంగా మురికి గుంతలో కూర్చుని డ్రైనేజీ పైప్‌లైన్‌ పనులను అడ్డుకున్నారు. శుక్రవారం మొదలైన ఆమె నిరసన కార్యక్రమం శనివారం (48 గంటలు) కూడా కొనసాగుతోంది. వివరాలు.. మాదాపూర్‌ డివిజన్‌ పరిధిలోని గోకుల్‌ ప్లాట్స్‌ 30 ఫీట్ల రోడ్డులో కొంత కాలంగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సమస్యలు తలెత్తాయి.

దీంతో స్థానికులు సొంతంగా సేకరించిన నిధులతో సుమారు 200 మీటర్ల మేర యూజీడీ పైప్‌లైన్‌ నిర్మాణ పనులను చేపట్టారు. అయితే ఇష్టానుసారం పైప్‌లైన్లు నిర్మిస్తున్నారని పేర్కొంటూ కాలనీకి చెందిన అరుణ అనే మహిళ పనులను అడ్డుకుంది. డ్రైనేజీ పైప్‌లైన్‌ కోసం ఏర్పాటు చేసిన గుంతలో కూర్చొని నిరసనకు దిగారు. కాలనీలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ (యూజీడీ) పనులను జీహెచ్‌ఎంసీ చేస్తుందని... మీరెందుకు చేస్తున్నారంటూ పనులను అడ్డుకుంది. అయితే, సొంత నిధులతో కాలనీని అభివృద్ధి చేసుకోవడంలో తప్పేంటని, తమ పనులకు అడ్డు రావద్దని కాలనీవాసులు​ ఆమెకు సూచించారు. 

అధికారులు ఏం చేస్తున్నారు..
ఇష్టానుసారంగా మురికి నీటి కాల్వలు నిర్మిస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురౌతాయని అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణాళిక బద్దంగా డ్రైనేజీ పైప్‌లైన్లు నిర్మించాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు. అందుకే ఈ కాలనీలో నివసిస్తున్న మహిళగా నిరసన తెలుపుతున్నానని స్పష్టం చేశారు. చందానగర్ డిప్యూటీ కమిషనర్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, పోలీస్ అధికారులకు ఇదే విషయాన్ని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా మురికి కాలువలు, మ్యాన్ హోళ్లు నిర్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కల్వకుంట్ల చరిత్రను లిఖించదలిచారా?

వాళ్లిద్దరు అబద్దాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా మారారు

గవర్నర్‌ దంపతులను సాగనంపిన ముఖ్యమంత్రి

‘ముఖచిత్రం చెక్కించడంలో కేసీఆర్‌ బిజీ’

ఆటంకాలు లేకుండా ఖైరతాబాద్‌ గణపతి దర్శనం ఎలా?

‘చర్చిల్లో, మసీదుల్లో ఇలానే చేయగలవా?’

ప్రగతి భవన్‌లో గవర్నర్‌కు వీడ్కోలు సభ

‘కాంగ్రెస్ పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంది’

ఈసారి మహాగణపతి సంపూర్ణ నిమజ్జనం

నేనూ టీవీ సీరియళ్లు చూస్తా...

ఓ ప్రేమ కథ.. మూడు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌

హైటెక్‌ కిచెన్‌

ఆస్పత్రులు హౌస్‌ఫుల్‌

పడకలు లేవని ముప్పు తిప్పలు

హరితహారం మొక్కా.. మజాకా!

ఒక మొహర్‌ రూ.50 వేలు..

తెలంగాణ సర్కార్‌కు రాజాసింగ్‌ వార్నింగ్‌

‘ప్రణాళికా’యుతంగా అభివృద్ధి

రైతుబంధు డబ్బు కాజేసేందుకు అడ్డదారులు

సిటీ సైక్లిస్ట్స్‌ @ ప్యారిస్‌

కలెక్టర్‌తో సహా అధికారులకు కోర్టు నోటీసు 

బతుకమ్మ చీరలొచ్చాయ్‌ !

తగ్గిన సీసీఐ.. తలొగ్గిన మిల్లర్లు!

నేడు ‘మీట్‌ యువర్‌ ఎండీ’

‘ప్రాణహిత’పై ఆశలు

ఎల్"బీపీ".. నగర్

మామకు మన సామాను

ఎమ్మెల్యే రేగాకు సీఎం కార్యాలయం నుంచి పిలుపు!

అవినీతిలో 'సహకారం'!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మీరే నిజమైన హీరోలు : మహేష్‌ బాబు

బిగ్‌షాక్‌.. అలీరెజా అవుట్‌!

హౌస్‌మేట్స్‌ను నిలదీసిన నాగ్‌!

సైరా కోసం నయన్‌ ఎంత తీసుకుందంటే!

జయలలిత బయోపిక్‌ టైటిల్‌ ఇదే!

నా మరో ప్రపంచం: నమ్రతా శిరోద్కర్‌