18మంది పిల్లలు పుట్టిన తర్వాతే..

1 Aug, 2019 10:16 IST|Sakshi

అప్పటివరకు కుటుంబ నియంత్రణకు నో అన్న దంపతులు

ఎట్టకేలకు ఒప్పించిన వైద్యులు

మనోహరాబాద్‌ (తూప్రాన్‌) : 18 మంది బిడ్డలు పుట్టాకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకుంటానని భీష్మించుకుంది ఓ బాలింత. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రంగాయపల్లిలో నివసిస్తున్న జార్ఖండ్‌కు చెందిన ప్యారేలాల్, మహంతి దేవి దంపతులకు ఇప్పటికే ఏడుగురు పిల్లలు. జూలై 28న మహంతి దేవి ఎనిమిదో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పటికైనా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోవాలని డాక్టర్లు సూచించగా ఆమె నో అంటూ మొండికేసింది. కారణమేంటని అడగ్గా తమ గ్రామానికి చెందిన ఓ దంపతులకు 18 మంది సంతానం ఉన్నారని, వారికంటే ఒక బిడ్డ ఎక్కువ పుట్టేవరకు ఆపరేషన్‌ చేయించుకోమని ఆ దంపతులు చెప్పారు. ఈ సమాధానంతో అవాక్కయిన వైద్యులు బుధవారం వారి ఇంటికి వచ్చి నచ్చజెప్పారు. ఇప్పటికే ఉన్న పిల్లల భవిష్యత్‌పై దృష్టి పెట్టాలని కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో ఎట్టకేలకు వారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు ఒప్పుకున్నారు.

మరిన్ని వార్తలు