పెళ్లయిన మూడు నెలలకే...

30 Mar, 2017 17:36 IST|Sakshi
పెళ్లయిన మూడు నెలలకే...
కథలాపూర్: కడుపునొప్పితో బాధపడుతూ కథలాపూర్‌ మండలం తాండ్య్రాలకు చెందిన ఓ వివాహిత పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయిన మూడు నెలలకే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో తాండ్య్రాలలో కలకలం రేపింది. స్థానికులు, ఎస్సై ఆరీఫ్‌ఖాన్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చందన అలియాస్‌ రాధను రాయికల్‌ మండలం రామోజీపేటకు చెందిన చుక్క క్రాంతికిచ్చి మూడునెలల క్రితం పెళ్లిచేశారు.

45 రోజుల క్రితం క్రాంతి ఉపాధికోసం గల్ఫ్‌వెళ్లాడు. అప్పటినుంచి చందన పుట్టినింట్లో ఉంటోంది. నాలుగురోజులుగా చందన కడుపునొప్పితో బాధపడుతోంది. మంగళవారం రాత్రి తన దాబాపైకి చేరుకుని క్రిమిసంహారకమందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను కోరుట్ల ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. చందన తల్లి ఇజ్జపు గంగు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
 
 
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శ్రీ సీతారాముల కల్యాణం..టీవీలో చూతము రారండి!

వైద్య, పోలీసు సిబ్బందికి పూర్తి వేతనం

సెట్స్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

‘కరోనా’ఎఫెక్ట్‌..నాడి పట్టేదెవరు?

సింగరేణి భూగర్భ గనులు మూసివేత

సినిమా

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా