డేర్‌ డెవిల్స్‌

26 Jan, 2020 03:01 IST|Sakshi

ఈ ఏడాది రిపబ్లిక్‌ డే పరేడ్‌లో మహిళలు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించనున్నారు. మహిళా కమాండర్‌ కెప్టెన్ తానియా షెర్గిల్‌ నేతృత్వంలో ఈసారి పరేడ్‌ జరగనుంది. రిపబ్లిక్‌ డే పరేడ్‌ నిర్వహణ చాలా కష్టమైన ప్రక్రియ. ఇందులో పాల్గొనే వారందరూ సమయపాలన పాటించాలి. ఒక్క సెకండ్‌ అటూ ఇటూ తేడా వచి్చనా మొత్తం పరేడ్‌ రసాభాస అవుతుంది. ఈసారి తానియా నేతృత్వంలో రిహార్సల్స్‌ అన్నీ విజయవంతంగా పూర్తి చేశారు.

భారత ఆర్మీకి సేవలు అందిస్తున్న జవాన్ల కుటుంబంలో నాలుగో తరానికి చెందిన మేజర్‌ తానియా వయసు 26 ఏళ్లు. అయితేనేం ఆమెలో అందరినీ కమాండ్‌ చేసే శక్తి అపారం. ఖాకీ యూనిఫామ్, చేతిలో కత్తి ధరించి చురకత్తిలా ఆర్మీ పరేడ్‌కు ఆమె నేతృత్వం వహించిన తీరు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. అదే ఆమెకి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు అవకాశాన్ని ఇచి్చంది. ఈసారి పరేడ్‌లో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన మహిళా బైకర్లు తమ శక్తిసామర్థ్యాలు ప్రదర్శించనున్నారు. 350సీసీ రాయల్‌ మోటార్‌ సైకిల్స్‌పై 65 మంది మహిళలు విన్యాసాలు చేయనున్నారు. మహిళా బైకర్లు విన్యాసాలు చేయడం ఇదే మొదటిసారి.   

మరిన్ని వార్తలు