దేవుడా.. ఎంతపనిజేస్తివి! 

23 Sep, 2019 07:47 IST|Sakshi

స్కూటీని ఢీకొన్న ఆటో మహిళ దుర్మరణం..

అనాథగా మారిన కొడుకు 

సాక్షి, ఇబ్రహీంపట్నం: కొన్నేళ్ల క్రితం ఆమె భర్త మృతిచెందాడు.. దీంతో పుట్టింటికి వచ్చింది. ఉన్న ఒక్కగానొక్క కుమారుడిని తన సర్వస్వంగా భావించి అతడిని అపురూపంగా పోషించుకుంటోంది. ఆ దేవుడు అంతలోనే వారిని చిన్నచూపు చూశాడు. మహిళ తన తల్లి, కుమారుడితో కలిసి స్కూటీపై వెళ్తుండగా మృత్యువు రూపంలో వచ్చిన ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆమె మృతిచెందగా కుమారుడు, తల్లికి తీవ్రగాయాలయ్యాయి. అందరి హృదయాలను ద్రవింపజేసే ఈ విషాదకర ఘటన ఆదివారం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చర్లపటేల్‌గూడ శివార్లలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నంలో నివాసముండే రామిడి పావని(28) తన తల్లి వసంత(55), కుమారుడు లిక్విత్‌రెడ్డి(10)తో కలిసి స్కూటీపై అమ్మమ్మ ఇల్లు అయిన కర్ణంగూడకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో చర్లపటేల్‌గూడ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో స్కూటీని వేగంగా వచ్చిన ట్రాలీ ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో పావని అక్కడిక్కడే మృతిచెందింది. ఆమె కుమారుడు లిక్విత్‌రెడ్డి, తల్లి వసంతకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు. అయితే, పావని అత్తగారిల్లు ఆదిబట్ల. ఆమె భర్త తొమ్మిదేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో కుమారుడితో కలిసి తల్లి వద్ద నివసిస్తుండేది. ఘటనా స్థలంలో మృతురాలి తల్లి రోదించిన తీరు హృదయ విదారకం. దేవుడా ఎంత పనిజేస్తివి అంటూ గుండెలుబాదుకుంది. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాబోయ్‌ ‘మెట్రో’

పల్లెల్లో ‘క్రిషి’

ఆ పైసలేవీ?

వర్షం @ 6 సెం.మీ

మంత్రివర్యా.. నిధులివ్వరూ! 

పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్‌ ఓవైసీ

కేంద్రం ఇచ్చింది.. 31,802 కోట్లే

కొత్త మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ తెస్తాం

అప్పులు 3 లక్షల కోట్లు

బార్‌ లైసెన్సుల అనుమతి పొడిగింపు 

తీరొక్క కోక.. అందుకోండిక!

రూ. 45,770 కోట్లు  తప్పనిసరి ఖర్చు

భూగర్భంలో మెట్రో పరుగులు!

9... నెమ్మది!

సంక్షేమం స్లో...

కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే 

రూ.91,727 కోట్ల భారం

మిగులు కాదు.. లోటే !

అప్పు.. సంపదకే!

సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ

రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ

ఈనాటి ముఖ్యాంశాలు

‘కేసీఆర్‌.. ఫ్రంట్, టెంట్ ఎక్కడ పోయింది?’

‘తప్పు చేస్తే ఎవరినైనా కఠినంగా శిక్షిస్తాం’

కౌలుదారులను గుర్తించే ప్రసక్తే లేదు: కేసీఆర్‌

పీఏసీ చైర్మన్‌గా అ‍క్బరుద్దీన్‌ ఒవైసీ

ఆఖరి మోఖా!

18 గంటలుగా సెల్‌ టవర్‌పైనే..

మోగిన ఉప ఎన్నిక నగారా !

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ కోరిక, కల అలాగే ఉండిపోయింది : చిరంజీవి

డేట్‌ ఫిక్స్‌?

స్టేజ్‌పైన కన్నీరు పెట్టుకున్న హిమజ

కౌశల్‌ కూతురి బర్త్‌డే.. సుక్కు చీఫ్‌ గెస్ట్‌!

పెళ్లికొడుకు కావాలంటున్న హీరోయిన్‌

‘అమ్మో.. దేవీ అదరగొట్టేశారు’