ప్రియుడు మోసం చేశాడని యువతి..

19 Jul, 2019 10:14 IST|Sakshi
ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేస్తున్న యువతి  

సాక్షి, దస్తురాబాద్‌ (ఆదిలాబాద్‌) : ప్రేమించిన ప్రియుడి చేతిలో మోసపోయిన ఓయువతి ప్రియుడి ఇంటి ఎదుట దీక్షకు దిగిన ఘటన మండలంలోని బుట్టాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులోని భాగ్యపల్లికి చెందిన సునీత పని నిమిత్తం ముంబైకి వలస వచ్చి ఒకరి ఇంట్లో హౌజ్‌ కీపింగ్‌ పనులు చేస్తోంది. అదే ఇంట్లో పనిచేస్తున్న మండలంలోని బుట్టాపూర్‌ గ్రామానికి చెందిన దుర్గం మహేష్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో వీరిరువురు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి గర్భవతిని చేశాడు. ఇంటి దగ్గర అప్పు చేసానని, తన దగ్గర రూ.లక్ష యాబై వేలు తీసుకుని ఇంట్లో పెద్దవారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ముంబాయి నుండి ఇంటికి వచ్చాడు. తీరా ఇంటికి వచ్చాక పెళ్లి చేసుకోనని చెప్పి ఫోన్‌ స్విచ్చాఫ్‌లో పెట్టాడు.

దీంతో తనకు ఏంచేయాలో తెలియక దుర్గం మహేష్‌తో అద్దె గదిలో ఉంటున్న తోటి 11మంది మిత్రులను తీసుకొని ముంబై నుంచి బుట్టాపూర్‌ గ్రామానికి చేరుకుంది. మహేష్‌ గురించి ఇంట్లో అడిగితే కుటుంబసభ్యులు దూషించారు. దీంతో ఏం చేయాలో తెలియక మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసు అధికారులు మూడు రోజుల నుంచి స్వీకరించలేదు. దీంతో మహిళా సంఘాల మద్దతుతో గురువారం పోలీస్‌స్టేషన్‌ వద్ద ధర్నాకు దిగింది. పోలీసులు బాధితురాలు, మహిళా సంఘాలతో కలిసి బుట్టాపూర్‌ గ్రామంలో మహేష్‌ ఇంటి ఎదుట దీక్షకు దిగారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్‌ సీఐ జయరామ్, దస్తురాబాద్‌ ఎస్సై అశోక్‌ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం బాధితురాలిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేపట్టారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లైన్‌కట్టిన నకిలీగాళ్లు

ప్రమాదకరంగా కాకతీయ కాలువ

బంగారు షాపులో భారీ చోరీ

ఓటమి భయంతోనే పింఛన్ల పంపిణీ: డీకే అరుణ

ఆటోలో మహిళ ప్రసవం

పాపం.. పసివాళ్లు

అనాథలే ఆదాయం!

ఔను.. ఇది కిరోసిన్‌ ఫ్రిడ్జ్‌

వేడుకున్నా వదల్లే..

మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి

కూరెళ్లకు దాశరథి పురస్కారం

భర్త, తండ్రి అందరి పేరు తెలంగాణే..!

‘బీజేపీలో ఎప్పుడు చేరేది త్వరలోనే చెబుతా’

చెవిమోతలో గ్రేటర్‌ ఫైవ్‌

యాసిడ్‌, ఫినాయిల్‌ కలిపి తాగి ఆత్మహత్యాయత్నం

రూ.100 ఇస్తామన్నా.. రూ.30 చాలట!

సీఎం దాకా వద్దు.. మేం చేసి పెడతాం

ఆ హెచ్‌ఎం తీరు.. ప్రత్యేకం 

జవాబుదారిలో భారీ మార్పులు

మదర్సాకు చేరిన పిల్లలు

గోదారి గుండె చెరువు

ప్యాసింజర్‌ రైలును పునరుద్ధరించాలి

ఒక కోడి.. 150 గుడ్లు

రూ.15 వేల కోట్లయినా కడతాం..

కాంగ్రెస్‌లో ‘కంగాళీ’

హెరిటేజ్‌ ఓ జోక్‌లా మారింది!

7 కొత్త కార్పొరేషన్లు

నీళ్ల నిలువను, విలువను తెలిపే థీమ్‌పార్క్‌ 

నిలబెట్టుకోలేక నిందలా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ