క్లర్కుగా చేసిన చోటే.. చైర్‌పర్సన్‌గా..!

28 Jan, 2020 07:24 IST|Sakshi

సాక్షి,భీమ్‌గల్‌ : అదృష్టమంటే ఇదేనేమో..! క్లర్కుగా పని చేసిన కార్యాలయంలోనే తొలి చైర్‌పర్సన్‌గా మల్లెల రాజశ్రీ ఎన్నికయ్యారు. నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మున్సిపాలిటీగా మారక ముందు గ్రామ పంచాయతీలో రాజశ్రీ క్లర్కుగా పని చేసేవారు. అయితే, 2006 నుంచి 2013 వరకు మల్లెల లక్ష్మణ్‌ వార్డు సభ్యుడిగా, 2013 నుంచి 2018 వరకు ఉప సర్పంచ్‌గా పని చేశారు. ఈ మధ్య కాలంలో రాజశ్రీ, లక్ష్మణ్‌ మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు వివాహం చేసుకున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా భీమ్‌గల్‌ మున్సిపాలిటీగా మారింది. చైర్‌పర్సన్‌ స్థానం బీసీ మహిళకు రిజర్వ్‌ అయింది. ఈ నెల 22న జరిగిన ఎన్నికల్లో రాజశ్రీ టీఆర్‌ఎస్‌ తరఫున తొమ్మిదో వార్డు నుంచి బరిలోకి దిగి.. భారీ మెజారిటీతో గెలిచారు. సోమవారం జరిగిన పరోక్ష ఎన్నికలో ఆమె చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.  
 

మరిన్ని వార్తలు