అశ్లీల వీడియోలకు అడ్డుకట్ట వేయండి

3 Jul, 2019 08:40 IST|Sakshi

సనత్‌నగర్‌: సామాజిక మాధ్యమాల్లో అశ్లీల వీడియోలు ప్రసారం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కోరారు. ఈ మేరకు మంగళవారం హోంమంత్రి మహమూద్‌ అలీని కలిసి  వినతిపత్రం అందజేశారు. గాయత్రీ వాలంటరీ సర్వీస్‌ ఆర్గనైజేషన్, ఝాన్సీ లక్ష్మిబాయి వాలంటరీ సర్వీస్‌ ఆర్గనైజేషన్లకు చెందిన పుష్పలత, దశరథ లక్ష్మి, ప్రొఫెసర్‌ కవిలత, జోయ, డాక్టర్‌ ప్రమీల, అనిత, జరీనా వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అశ్లీల వీడియోల కారణంగా యువత పెడదోవ పట్టే అవకాశం ఉందన్నారు. అశ్లీల వీడియోలు ప్రసారం చేస్తున్న సామాజిక మాధ్యమాలకు అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఉందన్నారు. యువత అత్యధికంగా వివిధ వెబ్‌సైట్‌లలో అశ్లీల చిత్రాలను చూస్తున్న కారణంగా మహిళలు, విద్యార్థినులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి నివారణకు అశ్లీల వెబ్‌సైట్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 12 ఏళ్ల లోపు బాలికలపై లైంగికదాడికి పాల్పడితే ఉరి శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రేణుకా ముదిరాజ్, కృష్ణగౌడ్, మధుగౌడ్, అనిత, సంగీత, నాగరాణి, తులసి తదితరులు పాల్గొన్నారు.

హోంమంత్రి మహమూద్‌ అలీకి వినతిపత్రం అందజేస్తున్న మహిళా సంఘాల ప్రతినిధులు...

మరిన్ని వార్తలు