చదువే ఆయుధం

26 Feb, 2018 14:48 IST|Sakshi
సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గండూరి ప్రవళిక

ఆడపిల్లలను అబ్బాయిలతో సమానంగా చూడాలి

తక్కువ అనే భావన పోవాలి

మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలి

సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గండూరి ప్రవళిక

‘ప్రస్తుత సమాజంలో మహిళా సాధికారత సాధించాలంటే మహిళలు ఉన్నత చదువులు చదవాలి. విద్యను ఒక ఆయుధంగా మల్చుకొని చదువులో రాణించా లి. ఆర్థికంగా బలపడడమే కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలి. దీంతో ఒకరిపై ఒకరు ఆధారపడే స్థితి నుంచి బయటపడినప్పుడు మహిళలు జీవితంలో ధైర్యంగా నిలదొక్కుకోగలుగుతారు’.. అని  సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గండూరి ప్రవళిక పేర్కొన్నారు. ‘సాక్షి’ మహిళా క్యాంపెయిన్‌లో భాగంగా ‘మహిళా సాధికారత’పై ఇంటర్వ్యూ వివరాలు ఆమె మాటల్లోనే..

సూర్యాపేట : మహిళలు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో రాణిస్తున్నా.. నేటికీ అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక అసమానతలు, వేధింపులు, గృహ హింస వంటివి కొనసాగుతున్నాయి. తల్లిదండ్రులు ఆడపిల్లలను అబ్బాయిలతో సమానంగా చూడాలి. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వంటి ఘటనలు వెలుగు చూçస్తు న్నాయి.  ఆడపిల్ల పుట్టగానే కష్టమనుకొని పాఠశాలకు పంపించకపోవడం, తొందరగా పెళ్లిళ్లు చేయడం వంటి ఆలోచనలు తల్లిదండ్రులు మానుకోవాలి. ఆడ, మగ ఎవరైతే ఏంటి మార్పు ఇప్పటికీ 40 శాతం వచ్చింది. ఆడ, మగ ఎవరైతేనే అని తల్లిలో మార్పు రావాలి. మగబిడ్డ పుడితే బాగుం టుందనే ఆలోచనను పారదోలాలి. దీంతో ఇక ఆడపిల్లలతో సమానంగా అబ్బాయిలను సమానంగా తల్లిదండ్రుల నుంచే మొదలవుతుంది.. అలాంటప్పుడు సమాజంలో లింగ వివక్ష ఉండదు.

తక్కువ అనే భావన దూరం చేయాలి
మహిళల్లో ముఖ్యంగా తమకు తాము తక్కువ అనే భావనను మనసు నుంచి దూరం చేయాలి. విద్య ద్వారానే విజ్ఞానం, ధైర్యం, లోకజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతోంది. కుటుంబ బాధ్యతల్లో మగ్గిపోకుండా వాటిలో కుటుంబ సభ్యులను బాధ్యులుగా చేస్తూ అన్ని రంగాల్లో ముందుకు సాగాలి.

మహిళల రక్షణకు ఎన్నో చట్టాలు..
ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు తీసుకొచ్చింది. చట్టాలతోనే మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టవచ్చు. పనిచేసే చోట్లతో పాటు ఇంట, బయట కూడా మహిళలు వేధింపులకు గురవుతున్నారు. వేధింపులు ఎదురైనప్పుడు మహిళలు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి. ప్రయాణాలు, కార్యాలయాల్లో వేధింపులు జరిగినప్పుడు వెంటనే బయటకు చెప్పాలి. ఇలాంటి సమయాల్లో రక్షణ కల్పించడానికి కోర్టు తీర్పులు, చట్టాలు ఉన్నాయి. దినపత్రికలు, ప్రసార మాద్యమాల ద్వారా వేధింపులు తెలియజేయాలి.  
 

మరిన్ని వార్తలు