లేడీస్‌ స్పెషల్‌

8 Apr, 2019 06:37 IST|Sakshi

మహిళల కోసం..మహిళల చేత

త్వరలో తరుణి మధురానగర్‌ స్టేషన్‌ వద్ద 60 రోజుల ఎగ్జిబిషన్‌

అందరికీ ఉచిత ప్రవేశం..

స్టాల్స్‌ ఏర్పాటుకు ముందుకొచ్చే మహిళలకు ప్రోత్సాహం..

ప్రత్యేక పోటీల నిర్వహణ..

సాక్షి,సిటీబ్యూరో: తరుణి మధురానగర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో మహిళలకు ప్రత్యేకంగా 60 రోజుల పాటు ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. త్వరలో ఈ ప్రదర్శనను ప్రారంభిస్తామన్నారు. ఈ స్టేషన్‌ నిర్వహణ బాధ్యతలు పూర్తిగా మహిళలే చేపడతారన్నారు. ఈ ప్రదర్శనలో మహిళలు, చిన్నారులకు సంబంధించిన అన్ని రకాల వస్తువులు లభ్యమయ్యేలా దుకాణాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. స్టేషన్‌ సమీపంలో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇందుకు సంబందించి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మహిళా సాధికారత పెంచడం, లింగ సమానత్వ సాధనను ఈ స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ సందర్భంగా పలు పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పోటీల వివరాలివీ..
ఆన్‌లైన్‌ స్లోగన్‌ కాంపిటీషన్‌: మహిళా సాధికారత, లింగ సమానత్వంపై స్లోగన్‌లను హెచ్‌టీటీటీపీఎస్‌://హెచ్‌ఎంఆర్‌ఎల్‌.సిఓ.ఐఎన్‌కు పంపించాల్సి ఉంటుంది. స్లోగన్లు ప్రధానంగా  భారతీయ కుటుంబంలో మహిళల కీలక పాత్ర, ఆడపిల్లల చదువు ప్రాముఖ్యత, తల్లి, చెల్లి, భార్య, బామ్మలుగా మహిళలు నిర్వహించే పాత్రలకు సంబంధించినవై ఉండాలి.
ఒక వైపు ఉద్యోగాలు చేస్తూ..మరోవైపు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చాగోష్టి.
చిన్నారులకు పెయింటింగ్, డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీల నిర్వహణ.
మహిళలకు రంగోలి, కుకింగ్‌లపై పోటీలు.
బెంగాళీ, తమిళ, మళయాలి, గుజరాతి, మరాఠి, రాజస్థానీ, ఈశాన్య భారత రాష్ట్రాల సంప్రదాయలు, కళల ప్రదర్శనలు.

తరుణి ఎగ్జిబిషన్‌ ప్రత్యేకతలివీ..
ఈ ప్రదర్శన తిలకించేందుకు వచ్చే వారికి ప్రవేశం ఉయితం.  
ఈ ప్రదర్శనలో 150 దుకాణాలను ఏర్పాటుచేయనున్నారు. వీటిలో మహిళలు, చిన్నారులకు అవసరమైన అన్ని రకాల వస్తువులు లభ్యమౌతాయి.
వెయ్యి ద్విచక్రవాహనాలు, వంద కార్లు పార్కింగ్‌ చేసుకునే అవకాశం.
చిన్నారుల ఆటా–పాటకు అనుగుణంగా ప్లే ఏరియా, ఇతర గేమ్స్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తారు.
దేశ, విదేశీ వంటకాలను రుచిచూసేందుకు ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయనున్నారు.
వివిధ సంప్రదాయ, సాంస్కృతిక కళల ప్రదర్శనకు ఏర్పాట్లు.
ఫైర్‌సేఫ్టీ ఏర్పాటు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
మహిళా పారిశ్రామిక వేత్తలను స్టాల్స్‌ ఏర్పాటుకు ప్రోత్సహించడం.

తరుణి ఎగ్జిబిషన్‌లో స్టాల్స్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నారా...?
ఈ ఎగ్జిబిషన్‌లో స్టాల్స్‌ ఏర్పాటు చేయాలనుకునేవారు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎస్టేట్‌ మేనేజర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ మాజిద్‌ మొబైల్‌ నం.7702800944, జీఎం రాజేశ్వర్‌ మొబైల్‌ నం.8008456866 సంప్రదించాలని హెచ్‌ఎంఆర్‌ అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు