పేదల అభ్యున్నతికి కృషి

27 Mar, 2018 12:41 IST|Sakshi
తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎంపీ బడుగుల చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి

మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట : పేదల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖామాత్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన బడుగుల లింగయ్యయాదవ్‌ తొలిసారిగా సూర్యాపేటకు రావడంతో ఆయన ఆత్మీయ ఆహ్వానం పలికారు. అనంతరం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. పక్క రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు అంటేనే వందల కోట్ల రూపాయలు చేతులు మారాయన్నారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే ఆర్థికంగా భయపడే వారినే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంపిక చేశారని చెప్పారు. ఇంటి పేరులోనే బడుగుల ఉన్న బడుగు బలహీన వర్గాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాధాన్యం కల్పిస్తుందనడానికి బడుగుల లింగయ్యయాదవ్‌ ఎంపికే నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. మరో అభ్యర్థి బండా ప్రకాష్‌ కూడా బడుగు బలహీన వర్గానికి చెందిన అది ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అన్నారు. కేసీ ఆర్‌కు నీడలా ఉండే జోగినేపల్లి సంతో ష్‌కుమార్‌ మూడో అభ్యర్థని చెప్పారు. రాజ్యసభకు ఈ తరహా అభ్యర్థులను ఎంపిక చేసి రాజకీయాల్లో పారదర్శకతను నిరూపించుకున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావంలోనే ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగంలో 51 శాతం బడుగు, బలహీన , హరిజన, గిరిజన మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లను రూపొందించుకున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌ మాత్రమే అని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా స్‌గౌడ్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గండూరి ప్రవళిక, మార్కెట్‌ చైర్మన్‌ వైవి, నాయకులు గండూరి ప్రకాష్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, వర్ధెల్లి శ్రీహరి, వట్టె జానయ్యయాదవ్, పోలెబోయిన నర్సయ్యయాదవ్, చనగాని రాంబాబుగౌడ్, ఉప్పల ఆనంద్, బైరు దుర్గయ్యగౌడ్, కక్కిరేణి నాగయ్యగౌడ్, జీడి భిక్షం, బైరబోయిన శ్రీనివాస్, గోదల రంగారెడ్డి, పుట్టా కిషోర్‌నాయు డు, రమాకిరణ్‌గౌడ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు