ఆర్టీసీ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం

27 Jul, 2014 01:11 IST|Sakshi
ఆర్టీసీ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం

యాదగిరిగుట్ట :ఆర్టీసీ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని హైదరాబాద్ జోన్ సీఎంఈ ఎస్.రవీంద్రబాబు, నల్లగొండ రిజీనల్ ఆర్‌ఎం బత్తిని రవీం దర్ అన్నారు. ఆర్టీసీ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా నల్లగొండ రీజియన్ స్థాయిలో ప్రమాదరహిత డ్రైవర్లకు అవార్డులు అందించేందుకు శనివారం యాదగిరిగుట్ట డిపోలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కార్మికులు ఆర్టీసీని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలన్నారు. అధికారులు, కార్మికుల మధ్య సమన్వయం ఉన్నప్పుడే తగిన ఫలితాలు సాధించగలమన్నారు. ప్రయాణికులను సురక్షితంగా  గమ్యస్థానం చేర్చి సంస్థకు తగిన పేరు, ఆదాయాన్ని తీసుకురావాల న్నారు.
 
 కేఎంపీఎల్, ఈపీకేలను సంస్థ సూచించిన లక్ష్యాల మేరకు సాధిం చేందుకు డ్రైవర్లు, కండక్లర్లు కృషి చేయాలన్నారు. ఇంధన పొదుపుపై తగిన శ్రద్ధ తీసుకుంటేనే సంస్థ పురోగతి సాధిస్తుందన్నారు. డ్రైవర్లు ప్రమాదాలు లేకుండా జాగ్రత్తగా నడపాలన్నారు. ఈ విషయంలో వారికి ఎప్పుటికప్పుడు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గుట్ట డిపో ఎప్పుడూ లాభాల్లో ఉంటుందన్నారు. ఇందుకు ఇక్కడి అధికారులు , కార్మికుల కృషే కారణమన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఏడు డిపోల్లో ఎలాంటి ప్రమాదాలూ లేకుండా రికార్డు సాధించిన 21మంది డ్రైవర్లను ఉత్తమ డ్రైవర్లుగా గుర్తించి వారిని  ఘనంగా సత్కరించారు. అవార్డులు అందించారు. కార్యక్రమంలో అధికారులు జాన్‌రెడ్డి, అనిల్‌కుమార్, డీఎం మద్దిలేటి, ఎస్‌ఐ నర్సింహరావు, పాల్, ఎన్. ఎల్లయ్య పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు