‘డిమాండ్లను పరిశీలించేదాకా సమ్మె’

25 Jul, 2018 14:50 IST|Sakshi
అర్ధనగ్నంగా నిరసన తెలుపుతున్న కార్మికులు  

నిజామాబాద్‌ నాగారం : విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లను పరిష్కరించేదాకా సమ్మె విరమించేది లేదని తెలంగాణ విద్యుత్‌ కాంట్రాక్టు కా ర్మికుల సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మెట్టు జాషువా పేర్కొన్నారు. సమ్మె మంగళ వారం నాలుగో రోజుకు చేరింది. విద్యుత్‌శాఖ జిల్లా కార్యాలయం ఎదుట కార్మికులు అర్ధ నగ్న ప్రద ర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా జాషు వా మాట్లాడుతూ ఏళ్ల తరబడిగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామన్నారు. ఉద్యోగ భద్రత కల్పిం చాలని, సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. టీడీపీ నాయకులు సమ్మెకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లయ్య, ప్రధాన కార్యదర్శి ఎండీ ముస్తాక్, ప్రతినిధులు శంకర్, ఇబ్రహీం, నవీన్, నాగర్జున, సాగర్‌ తదితరులు పాల్గోన్నారు. 

అండగా ఉంటాం..  

విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల సమస్య ప్రస్తుతం కోర్టులో ఉందని 1104 జిల్లా ప్రాంతీయ కార్యదర్శి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సమ్మె విరమిం చాలని కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే అందరం కలిసి ఐక్యంగా పోరాటాలు చేద్దామని 327 జిల్లా అధ్యక్షుడు ఎండీ జక్రియా, ప్రధాన కార్యదర్శి పూదరి గంగాధర్‌ పేర్కొన్నారు. కార్మికుల సమస్య కోర్టులో ఉందని, ప్రస్తుతం సమ్మె విరమించాలని టీఆర్‌వీకేఎస్‌ జిల్లా అధ్యక్షుడు శివాజీగణేశ్‌ కోరారు.   

కోర్టు ద్వారానే పరిష్కారం.. 

కామారెడ్డి అర్బన్‌: విద్యుత్‌ ఆర్టిజన్‌ల సమస్య కోర్టు ద్వారానే పరిష్కారం అవుతుందని 327 యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు ఎడ్ల సంపత్‌కుమార్, నాగరాజు, రాజిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం 327 యూనియన్‌ నాయకులు ఒక ప్రకటన విడుదల చేశారు.

2015లో అన్ని కార్మిక సంఘాలతో టీఈటీయూఎఫ్‌గా ఏర్పడి మహా ఉద్యమాన్ని చేపట్టామని, 24 వేల మంది కార్మికులను విలీనం చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయని పేర్కొన్నారు. అయితే కోర్టు కేసు ఉన్నందున ఆర్టిజన్‌ కార్మికులుగా గుర్తించారని తెలిపారు. రెగ్యులరైజేషన్‌ అంశం కోర్టు ద్వారానే పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. గుర్తింపు సంఘాలు ఈ విషయాన్ని విస్మరించి సమ్మె చేయడం సరైన పద్ధతి కాదని, వెంటనే సమ్మె విరమించి, విధుల్లోకి రావాలని కోరారు.

>
మరిన్ని వార్తలు