‘వితంతు’ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కృషి

27 Feb, 2017 03:05 IST|Sakshi
‘వితంతు’ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కృషి

ఎంపీ వినోద్‌కుమార్‌

హుజూరాబాద్‌: భర్తను కోల్పోయిన మహిళల కోసం ప్రత్యేకంగా ‘వితంతు’కార్పొరేషన్‌ ఏర్పాటు విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో వితంతు వివక్షత విముక్తి ఉద్యమ సమాఖ్య, బాల వికాస సంయుక్త ఆధ్వర్యంలో ‘మూఢ∙నమ్మకాల నిర్మూలన–వితంతు హక్కుల పరిరక్షణ’అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. భార్య మృతి చెందితే భర్తలకు వెంటనే పెళ్లి చేస్తుంటారని, అదే మహిళల విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు.

వితంతువును పెళ్లి చేసుకున్న వారికి కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతో పాటుగా, డబుల్‌ బెడ్రూం ఇంటిని ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. వితంతువుల పిల్లలకు నవోదయ స్కూళ్లలో రిజర్వేషన్‌ కోసం ఆ శాఖ మంత్రికి లేఖ రాస్తానన్నారు. బాల వికాస్‌ డైరెక్టర్‌ శౌరీరెడ్డి, ఏరియా ఇన్‌చార్జ్‌ ప్రతాపరెడ్డి, రాష్ట్ర వినియోగదారుల సంఘం సమాఖ్య అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు