మలేసియాలో ఘనంగా ‘మహిళా సదస్సు

4 Mar, 2019 02:06 IST|Sakshi

కౌలాలంపూర్‌: మలేసియా తెలుగు సంఘం, ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ సంస్థల ఆధ్వర్యంలో ‘ప్రపంచ తెలుగు మహిళా సదస్సు’ ఘనంగా నిర్వహించారు. కౌలాలంపూర్‌ సమీపంలోని సుబాంగ్‌జయలో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు పది దేశాల నుంచి తెలు గు మహిళా ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ సదస్సులో అమెరికాలోని కీ సాఫ్ట్‌వేర్‌ అధినేత దూదిపాల జ్యోతిరెడ్డికి ‘జీవన సాఫల్య పురస్కారం’ అందజేశారు. ఇదే కార్యక్రమంలో కోడూరు హరినారాయణరెడ్డికి జీవిత సాఫల్య పురస్కారం అందించారు.

వీరితోపాటు కోమల్‌రాణి, పద్మిని, జ్యోత్స్న, అన్నపూర్ణ, కొత్త కృష్ణవేణి తదితరులకు ‘మహిళా శిరోమణి’ పురస్కారాలను అందించారు. సదస్సులో భాగంగా పలువురు మహిళలు ప్రసంగిం చారు. మహిళలు ఒత్తిడిని జయించడం ఎలా? అనే అంశంపై డాక్టర్‌ మధురిమారెడ్డి, మహిళా సాధికారత గురించి డాక్టర్‌ రోజీ గుండ్ర, మలేసియాలో తెలుగు మహిళా వికాసంపై రేఖ, భారత్‌లో సాంప్రదాయ ఆలయాల విశిష్టత గురించి ఉజ్జయినీ మహం కాళి ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ అన్నపూర్ణ తదితరులు ప్రసంగించారు. సదస్సులో అచ్చయ్య కుమార్‌రావు, సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు