రసవత్తరంగా కుస్తీ పోటీలు

29 Mar, 2018 10:45 IST|Sakshi
కుస్తీపోటీల్లో తలపడుతున్న మల్లయోధులు 

నిజాంసాగర్‌ : సింగితం గ్రామంలో బుధవారం మల్లయోధులకు నిర్వహించిన కుస్తీ పోటీలు రసవత్తరంగా సాగాయి. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర నిర్వహించారు. రెండు రోజులుగా ఆలయం వద్ద ఎడ్ల బండ్లు, బోనాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయం ఆవరణలో మల్లయోధులకు కుస్తీపోటీలు జరిపారు.

చుట్టు పక్క గ్రామాల నుంచి మల్ల యోధులు తరలిరావడంతో కుస్తీపోటీలు పోటా పోటీగా జరిగాయి. గెలుపొందిన వారికి సింగితం ఎంపీటీసీ సభ్యురాలు కలకొండ శైలజ, సర్పంచ్‌ ఆనందపల్లి వీరమణి, టీఆర్‌ఎస్‌ నాయకులు కలకొండ నారాయణ, సాయాగౌడ్‌ నగదును బహుమతులుగా అందజేశారు. కార్యక్రమంలో గున్కుల్‌æ సోసైటీ వైస్‌చైర్మన్‌ సంగారెడ్డి నాయకులు బచ్చిగారి వెంకటేశం, సాయిలు, సంగయ్య, విఠల్, శ్రీదర్‌రెడ్డి న్నారు.   

హన్మాజీపేట్‌లో..
బాన్సువాడటౌన్‌ : హన్మాజీపేట్‌ గ్రామంలో బుధవారం కుస్తీపోటీలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన కుస్తీవీరులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పోటీల్లో గెలుపొందిన వారికి సర్పంచ్‌ సంగ్రామ్‌ నాయక్‌ నగదు బహుమతులు అందజేశారు. కుస్తీపోటీలు ఆద్యాంతం ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్‌ సాయిరాం, గ్రామపెద్దలు సుధాకర్‌రెడ్డి, బోనాల సాయిలు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు