జననేతకు ఘన నివాళి

3 Sep, 2014 03:31 IST|Sakshi

సాక్షి బృందం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 5వ వర్ధంతి వేడుకలను మంగళవారం కల్వకుర్తి, అచ్చంపేట, కొత్తకోట, దేవరకద్ర, షాద్‌నగర్, అలంపూర్, జడ్చర్ల, కొడంగల్, కొల్లాపూర్, నర్వ, ఆత్మకూర్, పట్టణాల్లో ఘనంగా జరిగాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు వైఎస్ విగ్రహాలకు పూలమాల లు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పలువురు నేతలు వైఎస్ సేవలను కొనియాడా రు. పాలమూరు నుంచి పలు సంక్షేమపథకాలను ప్రారంభించారని గుర్తుచేశారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాల యంలో వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి వైఎస్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల ప్రజలకు సంక్షేమపథకాలు అందజేసిన ఘనత వైఎస్‌కే ద క్కిందన్నారు.
 
  పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందజేసి.. ఎంతోమందికి చదువుకునే అవకాశం కల్పించారని గుర్తుచేశారు. ఇప్పుడేమో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకుండా పేద విద్యార్థులతో చెలగాటమాడుతుందన్నారు. అనంతరం అనాథ విద్యార్థులకు పండ్లు పంపిణీచేశారు. అచ్చంపేటలో వైఎస్‌ఆర్ సీపీ  నియోజకవర్గ సమన్వయకర్త బీష్వ రవీందర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు ప్రజ లగుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. వైఎస్ పథకాలను గత ప్రభుత్వాలు నీరుగార్చాయని విమర్శిం చారు.
 
 అనంతరం స్థానిక ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పం పిణీ చేశారు. వ్యవసాయానికి ఊపిరిపోసి..రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. కొల్లాపూర్‌లో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆ పార్టీ నేత మేనుగొండ రాముయాదవ్ వైఎస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీచేశారు. మక్తల్‌లోని వైఎస్‌ఆర్ సీపీ కార్యాలయంలో వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు. నారాయణపేటలో వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జమీర్‌పాషా ఆధ్వర్యంలో వర్ధంతి నిర్వహించారు. అనంతరం ‘పేట’ ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
 
 కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో..
 జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో వైఎస్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో అన్నివర్గాలకు అభివృద్ధి, సంక్షేమఫలాలు అందాయని డీసీసీ ఉపాధ్యక్షుడు రంగారావు కొనియాడారు. వైఎస్ అమలుచేసిన పథకాలను జిల్లానుంచే ప్రారంభించేవారని గుర్తుచేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మహబూబ్‌నగర్ మునిసిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్ మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్ ఆశయ సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. కొత్తకోటలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో వర్ధంతి జరిపారు. డీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పి.విశ్వేశ్వర్ మాట్లాడుతూ.. పేదప్రజల సంక్షేమం కోసం వైఎస్‌ఆర్ చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివన్నారు.
 
  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన స్వర్ణయుగంగా సాగిందని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ కీర్తించారు. అలంపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి నివాళులర్పించారు. మహానేత హయాం లోనే చెప్పుకోదగిన అభివృద్ధి పనులు జరిగాయని కొనియాడారు. గద్వాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి 5వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. స్థానిక డీకే బంగ్లా నుంచి వైఎస్‌ఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి మున్సిపల్ చైర్‌పర్సన్ బండల పద్మావతి, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు.
 

మరిన్ని వార్తలు