యాద మహారుషి కొలువైన మర్రిచెట్టు తొలగింపునకు సన్నాహాలు..?

5 May, 2020 13:24 IST|Sakshi
తులసీ కాటేజీలో మర్రి వృక్షంలో ఉన్న యాద మహారుషి

ప్రస్తుతం కొమ్మల నరికివేత..

యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆల యం కొండ చుట్టూ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా మొదటి ఘాట్‌ రోడ్డుకు పక్కన యాద మహారుషి కొ లువై ఉన్న భారీ మర్రి చెట్టును తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మర్రిచెట్టుకు ఉన్న పెద్దపెద్ద కొమ్మలను ఆర్‌అండ్‌బీ అధికారుల ఆదేశాలతో సిబ్బంది తొలగించినట్లు చెబుతున్నారు. యాద మహారుషి ఘోర తపస్సుతోనే యాదాద్రి క్షేత్రం రూపుదిద్దుకున్నట్లు చరిత్ర చెబుతోంది.  ప్రస్తుతం అభివృద్ధిలో భాగంగా చెట్టు కొమ్మలు తొలగించడంతో ఆ మహారుషికే నిలువ నీడ లేక మండుటెండలో కనిపిస్తున్నాడని స్థానిక భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ మర్రి వృక్షాన్ని తొలగించవద్దని, యాద మహారుషి కొలువై ఉన్న ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.   

మరిన్ని వార్తలు