రేఖ పట్టు.. కరోనాను తరిమికొట్టు!

24 Mar, 2020 12:33 IST|Sakshi
తాటివనం వద్ద ఏర్పాటు చేసిన బోర్డు ,నిడమనూరు : శాఖాపురంలో తాటి వనం వద్ద కల్లు తాగుతున్న గ్రామస్తులు

కరోనాను కల్లు అరికడుతుందని తాటి చెట్ల వద్ద బోర్డు ఏర్పాటు

గ్రామాల్లో కల్లుకు పెరిగిన గిరాకీ

యాదాద్రి భువనగిరి, నిడమనూరు (నాగార్జున సాగర్‌) : ప్రజలు కరోనా వైరస్‌ బారినపడకుండా ఉండడానికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. అందరూ ఇళ్లకు పరిమితం కావాలని, బయట తిరగవద్దని సూచించింది. దీంతో నిత్యవసర వస్తువుల దు కాణాలు, ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు మిన హా అన్నీ బంద్‌ అయ్యాయి. మద్యం దుకాణా లు సైతం మూతపడ్డాయి. నిడమనూరు మండలంలోని శాఖాపురం, రాజన్నగూడెం, నిడమనూరు, వేంపాడు, గుంటిపల్లి, ఊట్కూర్, మారుపాక, వెంకటాపురం గ్రామాల్లో తాటివనాలు ఉన్నాయి.

కాగా శాఖాపురంలో దోసపాటి అంజయ్య గౌడ్‌ అనే వ్యక్తి కల్లు కరోనా రాకుండా చేస్తుంది.. అనే సందేశం వచ్చేలా ‘రేఖ పట్టు–కరోనా పనిపట్టు’ అని బోర్డు పెట్టి పలువురిని ఆకట్టుకుంటున్నాడు. మద్యం దొరకకపోవడం.. కరోనా వైరస్‌ నివారణకు కల్లు అని ప్రచారం కావడంతో కల్లు తాగడానికి జనం పరుగులు తీస్తున్నారు. కరోనా వైరస్‌ కట్టడికే కల్లు తాగుతున్నామంటూ వయోభేదం లేకుండా తాటి వనాల వైపు పరుగులు తీస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పలువురు తాటి వనాల్లో కన్పిస్తున్నారు.  

మరిన్ని వార్తలు