‘డిసెంబర్‌లో పూర్తి.. మార్చిలో దర్శనాలు’ 

10 Oct, 2018 03:11 IST|Sakshi
ప్లాన్‌ పనులను వివరిస్తున్న ఆర్కిటెక్ట్‌ మధు 

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న ప్రధానాలయం పునర్నిర్మాణం పనులు ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి కానున్నాయని వైటీడీఏ వైస్‌చైర్మన్‌ కిషన్‌రావు తెలిపారు. దర్శనాలు మాత్రం మార్చిలోనే ప్రారంభమవుతాయన్నారు. యాదా ద్రి ఆలయ పనులను అధికారులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, స్వయం భూ మూర్తులున్న గర్భాలయ నిర్మాణాలన్నీ చిన్న జీయర్‌స్వామి ఆదేశాల మేరకు స్థపతి సుందర్‌రాజన్‌ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయన్నారు. 54 వ్యాలీ పిల్లర్లు నిర్మాణమయ్యాయన్నారు. భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకునేలా ఏర్పా ట్లు చేస్తున్నామన్నారు. ఆంజనేయ స్వామి, గండ భేరుండ నారసింహులకు ప్రదక్షిణలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆలయ ప్రారంభం నాటికి భద్రత, సీసీ కెమెరాలు, క్యూలైన్లు వంటి ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఆల యానికి 3 ప్రాకారాలు రానున్నాయని ఆర్కి టెక్టు ఆనందసాయి తెలిపారు. ధ్వజస్తంభం ఎత్తు ముఖ మండపాని కంటే, గర్భాలయం పై కప్పు కంటే తక్కువగా రానుందని స్థపతి సుందరరాజన్‌ పేర్కొన్నారు. సమావేశంలో దేవస్థానం ఈఓ గీతారెడ్డి, స్థపతి వేలు, ఆర్కిటెక్టు మధు, ఈఈ వసంత నాయక్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు