‘యాదాద్రి’ థర్మల్ ప్లాంట్ కోసం రీ సర్వే

13 May, 2015 00:26 IST|Sakshi

మోదుగుకుంటతండా(దామరచర్ల):మండలం పరిధిలో వీర్లపాలెం గ్రామంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతల పెట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ నిర్మాణ భూమి కోసం రెవెన్యూ సిబ్బంది మంగళవారం రీ సర్వే చేపట్టారు. 4 వేల మేఘావాట్ల సామర్థ్యం గల పవర్ ప్లాంట్ నిర్మాణానికి కావలసిన అటవీ భూమి 4676 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం జెన్‌కో సంస్థకు అప్పగించింది. ఆ భూముల పరిధిలో వీర్లపాలెం గ్రామ శివారులో గల మోదుగుకుంటతండా, కపూర్‌తండాలు ఉన్నాయి. తండాల పరిధిలో 405 ఎకరాల భూమి, 170 ఇళ్లు కోల్పోనున్నారు. అందుకు కలెక్టర్ సత్యనారయణరెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది ఆయా తండాల్లో సర్వే చేపట్టారు. ఇంటి వైశాల్యం, ఇల్లు దేనితో నిర్మిచారు. గదులు, బోరు, ప్రహరీ, వంటగది వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో తహసీల్దార్ వేముల రమాదేవి, డీటీ శేఖర్, ఆర్‌ఐ నూర్యకుమారీ, డీఎస్‌ఓ కిషన్, సర్వేయర్ ఉదయ్, వీఆర్‌ఓలు మేష్యానాయక్, రూప్‌రావులు పాల్గొన్నారు.
 
 సర్వేను అడ్డుకున్న తండావాసులు
 థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోతున్న మోదుగుకుంటతండా, కపూర్‌తండా ప్రజలు రెవెన్యూ సిబ్బందిని సర్యే చేయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు నష్టపరిహారం, పునరావాసం  విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా పవర్ ప్లాంట్ పనులు ఏ విధంగా చేపడుతారని అధికారులను నిలదీశారు. అప్పటి వరకు పనులు చేపట్టనివ్వమన్నారు.
 
 ప్రత్యేక ప్యాకేజీ అందజేస్తాం: ఆర్డీఓ కిషన్‌రావు
 తండా వాసులు సర్వేను అడ్డుకున్నారని తెలిసి ఆర్డీఓ కిషన్ రావు ఘటన స్థలానికి చేరుకుని తండావాసులతో మాట్లాడారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం పునరావసం, నష్టపరిహాం విషయంలో ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయనున్నట్టు చెప్పారు. అంతే కాకుండా ఉద్యోగ అవకాశాల్లో పాధాన్యత ఇస్తామని చెప్పడంతో తండావాసులు ఆందోళన విరమించారు.ఆర్టీఓ వెంట తహసీల్దార్ రమాదేవి, ఆర్‌ఐ సూర్యకుమారి, డీటీ శేఖర్ ఉన్నారు.
 

>
మరిన్ని వార్తలు