ఎమ్మెల్సీ యాదవ రెడ్డిపై వేటు

21 Jul, 2014 23:16 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పార్టీ విప్‌ను ధిక్కరించిన నవాబ్‌పేట జెడ్పీటీసీ కొంపల్లి యాదవరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్న ట్లు ప్రకటించింది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌తో యాదవరెడ్డి చేతులు కలిపా రు. ఎమ్మెల్సీగా కూడా వ్యవహరిస్తు ్తన్న ఆయన శాసనమండలి చైర్మన్ ఎన్నికల్లోను టీఆర్‌ఎస్ అభ్యర్థికే మ ద్దతు పలికారు. కాంగ్రెస్ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా రేసులో నిలిచిన యాదవరెడ్డి ఊహించనిరీతిలో గులాబీ గూటి కి చేరారు. ఈ నేపథ్యంలోనే కౌన్సిల్ ఎన్నికలతో గులాబీ శిబిరానికి చేరువైన యాదవరెడ్డి.. జెడ్పీ ఎన్నికల్లోను ఆ పార్టీ అభ్యర్థికే ఓటేశారు.
 
దీంతో పార్టీ విప్‌ను ఉల్లంఘించిన ఆయనపై అనర్హత వేటు వేయాలని డీసీసీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై బదులివ్వాలని కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కేంద్రమాజీ మంత్రి జైపాల్‌రెడ్డి శిష్యు డిగా కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించిన యాదవరెడ్డి ఏఐసీసీ సభ్యుడు కూడా. ఈక్రమంలోనే ఆయనపై బహిష్కరణాస్త్రం ప్రయోగించడం ఆలస్యమైందని పార్టీవర్గాలు స్పష్టం చేశాయి. జిల్లా పరిష త్ ఎన్నికలకు ముందు చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించి న అనంతరం... సొంత పార్టీ సభ్యులను క్యాంపులకు తరలించలేని పరి స్థితుల్లో చైర్మన్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.  
 
వ్యూహాత్మకంగా అ ప్పటికే టీఆర్‌ఎస్ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపిన యాదవ... మండలి ఎన్నికల్లోను, ఆ తర్వాత జరిగిన జెడ్పీ ఎన్నికల్లోను కాంగ్రెస్‌కు ‘చెయ్యి’చ్చారు. ఇదిలావుండగా, రాష్ట్ర రాజకీయాల్లో గుర్తిం పు పొందినప్పటికీ, జిల్లాలో మాత్రం ఆయన చెప్పుకోదగ్గ స్థాయిలో పేరు సంపాదించలేదు. ఈ నేపథ్యంలోనే జెడ్పీ ద్వారా జిల్లా రాజకీయాల్లో అడుగిడాలని చేసిన ప్రయత్నాలు.. అనూహ్య మలుపులు తిరిగి సొంత పార్టీనే వీడేందుకు కారణమైంది.

మరిన్ని వార్తలు