ప్రకృతి వైద్యంతోనే ఆరోగ్యం

4 Nov, 2019 04:17 IST|Sakshi

భారతీయ వైద్యానికి కేంద్రం ప్రాధాన్యం

కేంద్ర మంత్రి యశోనాయక్‌ వెల్లడి

వెంగళరావునగర్‌: భారతీయ వైద్యాన్ని పరిరక్షించడానికి, దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని వెంగళరావునగర్‌ డివిజన్‌ పరిధిలోని యునానీ కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థలో (యునా నీ ఆసుపత్రి) ఇటీవల ఆధునీకరించిన భవన సముదాయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం యునానీ ఆస్పత్రి హాల్‌లో జరిగిన సమావేశంలో యశోనాయక్‌ మాట్లాడుతూ.. ప్రకృతి వైద్యంతోనే పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. యునానీ, ఆయుర్వేదం, సిద్ధ, యోగ, ప్రకృతి చికిత్స తదితర విధానాల ద్వారా దీర్ఘకాలిక రోగాలు సైతం మాయం అవుతాయని చెప్పారు. దీని ని ప్రతి ఒక్కరూ విశ్వసించాలన్నారు.

యునా నీ, ఆయుర్వేదం ద్వారా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా, మరోసారి రోగం తిరిగి రాకుండా పూర్తి స్థాయిలో నయం అవుతుందని తెలిపారు. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం మన భారతీయ వైద్యాన్ని క్షేత్రస్థాయి నుంచి ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొత్త మందులను తయారు చేయి స్తున్నామని చెప్పారు. ఇందుకోసం కోట్లాది రూపాయల బడ్జెట్‌ను ప్రధాని మోదీ కేటాయిస్తున్నారన్నారు. దేశంలో 50 ప్రాంతాల్లో ప్రకృతి వైద్యానికి సంబంధించిన రీసెర్చ్‌ సెంటర్లను ఏర్పాటు చేసి వాటికి నిరంతరం నిధులను మంజూరు చేస్తున్నామన్నారు.

ప్రజలకు విశ్వాసం కల్పించాలి: కిషన్‌రెడ్డి 
యునానీ మీద మరింతగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రజలకు ప్రకృతి వైద్యం పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని, అయితే ఎలాంటి ప్రమా దం లేదని వారికి మనం నిరూపించి అనుమానాలను నివృత్తి చేయాలని వైద్యులకు సూచిం చారు. ఈ కార్యక్రమంలో ఆయుష్‌ అడిషనల్‌ సెక్రటరీ ప్రమోద్‌ కుమార్‌ పాఠక్, యునానీ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ మునావర్‌ హుస్సేన్‌ ఖజ్మీలతో పాటు ఆయుర్వేద, సిద్ధ, ప్రకృతి వైద్యాలయం, యోగా తదితర ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.  

భవన సముదాయాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రులు యశోనాయక్, కిషన్‌రెడ్డి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా