దేశాన్ని చుట్టేద్దామా !

17 Dec, 2014 03:40 IST|Sakshi
దేశాన్ని చుట్టేద్దామా !

ఉత్తరాన ఢిల్లీ, జైపూర్, బృందావనం  దక్షిణాన రామేశ్వరం, కన్యాకుమారి
ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు  5 శాతం రాయితీ, బీమా కవరేజీ

 
శీతాకాలం చివర్లో ప్రకృతి అందాలు ఆస్వాదించాలనుందా.. అరుుతే గోల్డెన్ ట్రయూంగిల్ ప్యాకేజీలు మీ కోసమే. ఇండియన్ రైల్వేస్ అండ్ క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) వీటిని ప్రకటించింది. ఈ పర్యటనల్లో టికెట్ చార్జీపై  ఐదు శాతం రాయితీ, ప్రమాద బీమా కూడా కల్పిస్తోంది.
 - సాక్షి, హన్మకొండ
 
ఉత్తర భారత దేశ యూత్ర ఇలా..
 
ఉత్తర భారతదేశ గోల్డెన్ ట్రయాంగిల్ ప్యాకేజీ లో ఢిల్లీ, ఆగ్రా, బృందావనం, మధుర, జైపూర్ ఉన్నాయి. ఈ యాత్ర 7 రాత్రులు, 8 పగళ్లుగా ఉంటుంది. డిసెంబర్ 20న ఈ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి రాత్రి 10:30 గంటలకు బ యల్దేరి కాజీపేట, బల్లార్షా, నాగ్‌పూర్, ఇటా ర్సీ, భోపాల్ మీదుగా రెండోరోజు తెల్లవారుజామున 4:05 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ చేరుతుంది. మూడోరోజు ఢిల్లీలో పర్యాటక ప్రాంతాలైన ఇండియాగేట్, కుతుబ్‌మీనార్, పార్లమెంట్, రాజ్‌ఘాట్, అక్షర్‌ధామ్, లోటస్ టెంపుల్ సందర్శన ఉంటుంది. రాత్రి జైపూర్ ప్రయాణం ఉంటుంది.
 
నాలుగోరోజు జైపూర్ లో అంబర్‌ఫోర్ట్, జంతర్‌మంతర్, హవామహల్, సిటీ ప్యాలెస్ చూపిస్తారు. రాత్రి బస అక్కడే. ఐదో రోజు ఫతేపూర్, సిక్రీల మీదుగా ఆగ్రాలో తాజ్‌మహల్ సందర్శన ఉంటుంది. ఆరో రోజు మధుర, బృందావనం, ద్వారకాదీశ్‌లను పర్యటకులు సందర్శించవచ్చు. ఏడో రో జు మధ్యాహ్నం 1:00 గంటకు మధురై రైల్వేస్టే షన్ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏసీ ప్రయాణంలో ఒక్కో వ్యక్తికి రూ.20,755, ఇద్దరికి రూ. 16,892, ముగ్గురికి రూ.15,897లను టికెట్‌గా నిర్ణయించారు. పిల్లలకు టికెట్ రూ. 10,486.
 
రామేశ్వరం యాత్ర విశేషాలు
 
దక్షిణ భారతదేశ గోల్డెన్ ట్రయాంగిల్ టూర్‌లో భాగంగా రామేశ్వరం, కన్యాకుమారి, మధురై, నాగర్‌కోయిల్‌లో పర్యటించవచ్చు. 2015 జనవరి 28, మార్చి 4 తేదీల్లో ఈ యాత్ర ఉం టుంది. ఈ రెండు రోజుల్లో సాయంత్రం 5:55 గంటలకు కాచిగూడ నుంచి రైలు బయల్దేరి త ర్వాతి రోజు రాత్రి 7:45 గంటలకు రామేశ్వరం చేరుతుంది. మూడోరోజు రామేశ్వరంలోని అగ్నితీర్థం, రామనాథస్వామిగుడి, ధనుష్కోటి బీచ్, పంచముఖి హన్మాన్, రామ్‌కుంఢ్, పంబర్ వంతెనలను సందర్శిస్తారు. అదేరోజు రాత్రి కన్యాకుమారికి ప్రయాణవుతారు. నాలుగోరోజు కన్యాకుమారిలో సూర్యోదయం సందర్శనతో పర్యటన మొదలవుతుంది. పద్మనాభపురం ప్యాలెస్, వివేకానందరాక్ మెమోరియల్, ఇతర పర్యాటక ప్రాంతాల సందర్శన ఉంటుంది. ఐదోరోజు మధుర మీనాక్షి దర్శనమయ్యూక హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం. ఈ ప్యాకేజీలో స్లీపర్‌క్లాస్ ప్రయాణానికి ఒకరికి రూ.10,078, ఇద్దరికి రూ. 8,530, ముగ్గురికి రూ. 8,219. త్రీటైర్ ఏసీకి సంబంధించి ఒకరికి రూ.16,767, ఇద్దరికి రూ.14,626, ముగ్గురికి రూ.12,699లుగా చార్జీ వసూలు చేస్తారు.

మరిన్ని వార్తలు