యువతరం కదిలింది

22 Dec, 2019 03:45 IST|Sakshi

పౌర ఆగ్రహం పొగలు సెగలు కక్కింది. రేపిస్టులపైనా, అక్కరకు రాని చట్టాలపైనా.. పాలకులపైనా, ప్రమాదకరంగా మారిన పర్యావరణంపైనా.. అవినీతిపైనా, అసమానతలపైనా... యువతరం పిడికిలి బిగించి కదం తొక్కింది. భారత్‌ నుంచి హాంకాంగ్‌ వరకు.. లెబనాన్‌ నుంచి చిలీ వరకు నిరసనలు మిన్నంటాయి.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. పోలీసుల తూటాలు ఆందోళనకారుల గుండెల్లో దిగుతున్నాయి. అయినా జనం రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ఇలాంటి ఆందోళనలు భారత్‌కే పరిమితం కాలేదు. పాలకులు తప్పుదారిలో నడిస్తే సరైన దారిలో పెడతామంటూ ప్రపంచ వ్యాప్తంగా నవతరం నినదిస్తోంది. అందుకే 2019ని నిరసనల సంవత్సరంగా అభివర్ణిస్తున్నారు. ఈ ఏడాది వివిధ దేశాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడిన ఆందోళనలే ఇవాల్టీ సండే స్పెషల్‌..

>
మరిన్ని వార్తలు