ఎత్తిపోతలకు కుదరని ముహూర్తం.!

2 Oct, 2019 10:34 IST|Sakshi
డెలివరీ చాంబర్‌ వద్ద వరద ఉధృతి

ఇప్పటికీ నిండుకుండగా ఎల్లంపల్లి

ఎత్తిపోతలకు మరింత కాలం 

సాక్షి, రామగుండం: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌–1లో భాగంగా కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లిలోకి నీటిని ఎత్తిపోయడం. ఈ నేపథ్యంలో ఇప్పటికే మేడిగడ్డ, కన్నెపల్లి, అన్నారం పంపుహౌజ్‌ల నుంచి ఎత్తిపోతలు ప్రారంభించి రివర్స్‌ పంపింగ్‌ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌–1లో చివరి పార్వతీ (సుందిళ్ళ–గోలివాడ) పంపుహౌజ్‌ ఎత్తిపోతలకు ముహుర్తం కుదరడం లేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల మూలంగా ఇన్‌ఫ్లో భారీగా వస్తుండడంతో ఎల్లంపల్లి నిండుకుండను తలపిస్తుంది. గతేడాదితో పోల్చితే ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు మూడు దఫాలుగా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని వదులుతున్నారు.

ఫలితంగా పార్వతీ పంపుహౌజ్‌ నుంచి ఎల్లంపల్లిలోకి రివర్స్‌ పంపింగ్‌తో ఎత్తిపోతలు ప్రారంభించలేదు. జూలై 31న తొలిసారి పంపుహౌజ్‌లో ఒకటవ నెంబర్‌ మోటార్‌కు వెట్‌ రన్‌ చేసిన అధికారులు క్రమంగా నాలుగు, ఐదు రోజుల వ్యవధిలో దశల వారీగా అన్ని మోటార్లను వెట్‌ రన్‌ నిర్వహించి ఎత్తిపోతలకు సిద్ధం చేసినా ఇంకా వాటితో అవసరం పడడం లేదు. ప్రకృతి అనుకూలించడంతో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎల్లంపల్లి నుంచి వదిలిన నీరు సుందిళ్ల బ్యారేజీకి చేరాయి. అక్కడ వరద నీటి నిల్వలు పెరగడంతో, గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు. ఫలితంగా పార్వతీ పంపుహౌజ్‌ నుంచి ఎత్తిపోతలు చేపట్టే అవకాశాలు లేకపోవడంతో మరింత కాలం పట్టే అవకాశం ఉందని నీటి పారుదలశాఖ అధికార యంత్రాంగం పేర్కొంటుంది.

పార్వతీ పంపుహౌజ్‌లో ఉన్న తొమ్మిది మోటార్లను అధికారులు వెట్‌ రన్‌ నిర్వహించి సిద్ధంగా ఉంచారు. ఒక్కో మోటారు 40 మెగావాట్ల సామర్థ్యం గల 24 గంటలు నిరంతరంగా మోటారు నడిపిస్తే 2,600 క్యూసెక్కులను ఎత్తిపోసే అవకాశం ఉంటుంది. తొమ్మిది మోటార్లు నిరంతరంగా 24 గంటలు నడిపిస్తే 23,400 క్యూసెక్కులను ఎత్తిపోయవచ్చన్నారు. కాగా ఎల్లంపల్లి బ్యాక్‌ వాటర్‌ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు 6వ ప్యాకేజీ ద్వారా నీటి మళ్లింపు జరిగి, ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేకుంటేనే పార్వతీ పంపుహౌజ్‌ నుంచి ఎల్లంపల్లిలోకి ఎత్తిపోతలు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు 148 మీటర్ల ఎత్తులో 20.175 టీఎంసీలు వరద నీరు కాగా ప్రస్తుతం 148 మీటర్ల ఎత్తులో 19.60 టీఎంసీలు నిల్వ ఉంది. ఫలితంగా పార్వతీ పంపుహౌజ్‌ డెలివరీ సిస్టర్న్‌ వరకు వరద నీటి ఉధృతి ఉంది. ఏది ఏమైనా ప్రకృతి సహకరించడంతో భారీగా ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుండడంతో పార్వతీ పంపుహౌజ్‌ నుంచి ఎల్లంపల్లిలోకి ఎత్తిపోతలకు ముహుర్తం రాకపోవడం గమనార్హం. 

నిండుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 148 మీటర్ల ఎత్తులో 20.175 టీఎంసీ సామర్థ్యం కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 147.8 మీటర్ల ఎత్తులో 19.65 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి మంగళవారం ఇన్‌ఫ్లో 46,898 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 54,190 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టుకు మధ్యలో పది గేట్లను మీటరు ఎత్తు వరకు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నకిలీ బంగారం కలకలం

మెట్రో స్టేషన్లలో మరమ్మతులు

ఆ వార్త తెలిసి ఆశ్రమానికి...

జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదాం

వరంగల్‌ స్టేషన్‌: గాంధీజీ నడియాడిన నేల

బీజేపీ ‘గాంధీ సంకల్పయాత్ర’

మాకెందుకియ్యరు? చీరలు..

విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో..

బాపూజీ అస్థికలు తీసుకురావడానికి తర్జనభర్జన చేశారు

మాన్‌సూన్‌... మారింది సీన్‌

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

అక్టో ‘బీరు’ ఫెస్ట్‌

పట్నం శిగలో మరో నగ!

‘పాలిథిన్‌’పై సమరం.. నేటినుంచి నిషేధం

బతుకమ్మ చీరలు మాకొద్దు

45..నామినేషన్ల తిరస్కరణ

ఒక్కసారి వాడిపడేసినా నిషేధం

నీలగిరిలో మలమూత్ర వ్యర్థాల శుద్ధి కేంద్రం

పల్లెల్లో టీవాలెట్‌

ఏప్రిల్‌ నాటికి దక్షిణ మధ్య రైల్వే రెండు ముక్కలు 

మున్సి‘పోల్స్‌’ పిల్స్‌పై తీర్పు వాయిదా

దేవికారాణి, పద్మల మధ్య రాజీకి నాగరాజు యత్నం!

సచివాలయాన్ని కూల్చొద్దు

ఆర్టీసీని కాపాడుదాం

నిజాంసాగర్‌పై మూడు ఎత్తిపోతలు

క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉల్లంఘనలు

మునుగుతున్న పడవకు ఓటేస్తారా?

హైదరాబాద్‌లో ఇస్రో శాస్త్రవేత్త దారుణ హత్య

సీటెల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రెండు రోజులు నిద్రే రాలేదు

ఓవర్సీస్‌ టాక్‌.. ‘సైరా’ అదిరిపోయింది

సైరా విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌

‘ఊరంతా అనుకుంటున్నారు’ అందరికీ నచ్చుతుంది

సైరా నాకో పుస్తకం

నామినేషన్‌లో ఉన్నదెవరంటే..?