అవ్వా! మాస్కు ధరించు: నా తల్లే..

11 May, 2020 10:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇటు నాగరికత నేర్చిన అమ్మాయి.. అటు ఆధునికత తెలియని అవ్వ.. ఇద్దరూ కలిశారు.. ఆ తర్వాత ఏమైంది? ‘అవ్వా.. బాగున్నావా?’ అంటూ ఆప్యాయంగా ఆమె చేతుల్లో పండ్లు, కాసింత డబ్బు పెట్టిందా యువతి. పట్టించుకునే వారు లేక దీనంగా కూర్చున్న ఆ పండుటాకు ముఖంలో ఆనందం.. అక్కడితో ఇది ముగిసిపోయి ఉంటే ఇది రొటీన్‌ ‘చిత్రమే’ అయ్యేది. ఆ తరువాతే అసలు విషయం మొదలైంది.. ‘అవ్వా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖానికి మాస్కు ధరించాలి. చేతులు శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.. ఇవి తప్పనిసరి’ అంటూ వాటిని వృద్ధురాలికిస్తూ జాగ్రత్తలు చెప్పిందా యువతి. ‘నా.. తల్లే’ అంటూ మురిసిపోయిందా వృద్ధురాలు. కరోనా వైరస్‌ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు అద్దం పట్టిన ఈ ‘చిత్రం’ ఆదివారం రాయదుర్గం రోడ్డులో ‘సాక్షి’ కంటపడింది.

చదవండి : రోజు విడిచి రోజు స్కూలుకు..

మరిన్ని వార్తలు