నాడు ప్రేమన్నాడు.. నేడు కాదన్నాడు

20 Sep, 2019 09:49 IST|Sakshi
సృజన్‌ ఇంటి ఎదుట బైఠాయించిన యువతి, తల్లిదండ్రులు

ఆధార్‌ కార్డు తీసుకురమ్మని పంపితే  పెళ్లి చేసుకొచ్చాడు

పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడు

వరంగల్‌ చౌరస్తా: ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడి ఇంటి ఎదుట బాధిత యువతి కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగిన సంఘటన వరంగల్‌ 16వ డివిజన్‌లో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. లక్ష్మిపురానికి చెందిన పోలెపాక సృజన్‌కు అదే ప్రాంతానికి చెందిన యువతి పరిచమైంది. ఆరేళ్ల కిందట ప్రేమ పేరుతో వెంబడించడం, యువతి తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో వెళ్లి మాట్లాడటం చేశాడు. కాల క్రమేణ శారీరకంగా బలవంతం చేశాడు. అందుకు యువతి నిరాకరించడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లొంగదీసుకున్నాడు. పెళ్లి విషయంపై యువకుడి తల్లి విజయ, చెల్లెలికి వివరించిగా, వారు అంగీకరించినట్లు తెలిపింది. నెల రోజుల క్రితం పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిలదీయగా చేసుకోనని, తిట్టి పంపించాడు.

దీంతో యువతికి ఇంతేంజార్‌ గంజ్‌ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు ఇద్దరిని పిలిచి వయస్సు నిర్ధారణకు ఆధార్‌ కార్డులు తీసుకురావాలని సూచించారు. అంగీకరించిన సృజన్‌ మర్నాడు మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. దీంతో బాధిత యువతి తల్లిదండ్రులతో కలిసి యువకుడి ఇంటి ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. న్యాయం చేయాలని, వివాహం జరిపించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మీసాల ప్రకాశ్, టీఆర్‌ఎస్‌ నాయకుడు సీతయ్య తదితరులు యువతికి అండగా మద్దతు పలికారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి యువకుడిని మందలించగా, మరో యువతిని ఒక రోజు ముందే పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు సృజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఇంతేంజార్‌ గంజ్‌ పోలీసులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అత్యాచార నిందితుడికి శిక్ష ఖరారు

‘కోడెలను కొడుకే హత్య చేశాడు’

లారీని ఢీకొన్న వ్యాను.. ఆరుగురు మృతి

ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన అంబులెన్స్‌

అంతర్జాతీయ టెలిఫోన్‌ కాల్స్‌ దొంగల ముఠా అరెస్ట్‌

అదృశ్యమై.. హీరో ఫాంహౌస్‌లో అస్థిపంజరంలా తేలాడు

ప్రియుడితో బంధం భర్తకు చెప్తాడనే భయంతో..

పెద్దబొంకూర్‌ వీఆర్‌ఏ సస్పెన్షన్‌

పాపం పసికందు

వ్యభిచార గృహంపై దాడి

ఏటీఎం కార్డులు మార్చడంలో ఘనుడు

చెన్నకేశవ ఆలయ ఈవో దుర్మరణం

ప్రాణం ఖరీదు రూ.2లక్షలు..?

తప్పని ఎదురుచూపులు..

మెడికల్‌ సీటు ఇప్పిస్తానని ‘నీట్‌’గా మోసం

రోగిగా వచ్చి వైద్యుడికి మస్కా

నవ వధువు ఆత్మహత్య

ఇన్‌స్టాగ్రామ్‌లో సోదరిని ఫాలో అవ్వొద్దన్నాడని..

నామకరణం చేసేలోపే అనంత లోకాలకు

అత్తారింటికి వెళ్తే.. మర్మాంగాన్ని కోసేశారు

ఆశలు చిదిమేసిన బస్సు

మూఢనమ్మకం మసి చేసింది

మొసళ్లనూ తరలిస్తున్నారు!

కుమారుడిని లండన్‌ పంపించి వస్తూ... 

పీఎన్‌బీ స్కాం: నీరవ్‌ రిమాండ్‌ పొడిగింపు

వైఎస్సార్‌ జిల్లాలో విషాదం...

బిడ్డకు తండ్రెవరో తప్పు చెప్పినందుకు.....

దారుణం : కూతురుపై కన్నతండ్రి లైంగిక దాడి

ప్రియురాలి బంధువుల వేధింపులు తాళలేక...

అతడికి ఆ అలవాటు ఉన్నందుకే..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘గద్దలకొండ గణేష్‌’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌: ఇంటి సభ్యులందరికీ బిగ్‌ షాక్‌!

సెంట్రల్‌ జైల్లో..

గద్దలకొండ గణేశ్‌

స్టార్స్‌ సీక్రెట్స్‌ బయటపెడతాను

మాట కోసం..