అర్హత సాధించినా ఉద్యోగమివ్వరా?

25 Sep, 2018 02:27 IST|Sakshi

కలెక్టర్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

ఖమ్మం సహకారనగర్‌: కోర్టులో ప్రభుత్వ ఉద్యోగానికి తాను అర్హత సాధించినా తనకు ఉద్యోగం ఇవ్వలేదని ఖమ్మంకు చెందిన ఓ యువకుడు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నగరంలోని నిజాంపేటకు చెందిన జాగటి సాంబయ్య కోర్టులో అటెండర్‌ ఉద్యోగానికి 2012లో దరఖాస్తు చేశాడు. అయితే, అతడికి ఉద్యోగం రాలేదు. కానీ, సమాచార హక్కు చట్టం వివరాల ప్రకారం.. తాను రెండో సా ్థనంలో ఉండగా, మొదటి, మూడో స్థానంలో ఉన్న వారికి అటెండర్‌ ఉద్యోగం కల్పించారని తేలింది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్‌ను కలిసేందుకు ప్రజావాణికి వచ్చాడు. దీంతో ఔట్‌ సోర్సింగ్‌లో ఉద్యోగం కల్పిస్తానని చెప్పడంతో మనస్తాపానికి గురై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అధికారులు, కలెక్టర్లు గన్‌మెన్లు అతడిని అడ్డుకుని బయటకు పంపించారు.  

మరిన్ని వార్తలు