కన్నీటి బతుకులో పన్నీటి జల్లు

30 Oct, 2019 12:45 IST|Sakshi

అనాథ యువతిని చేరదీసిన యువకుడు  

మనీషాను మనువాడిన లీలాకృష్ణ సాయి  

ఆశీర్వదించిన గాదె ఇన్నయ్య దంపతులు

బంజారాహిల్స్‌: మానవత్వం మూర్తీభవించింది. నవజీవన యానానికి నాంది పలికింది. అనాథ యువతికి అండ దొరికింది. తనకంటూ ఎవరూ లేరని మనోవేదన చెందే హృదయానికి సాంత్వన లభించింది. మంచి మనసుతో ఓ యువకుడు అనాథ యువతిని వివాహం చేసుకుని గుండెగూటిలో స్థానమిచ్చాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ‘మా ఇల్లు ప్రజాదరణ’ అనాథాశ్రమంలో మనీషా అనే యువతి ఆశ్రయం పొందుతోంది. కూకట్‌పల్లిలోని సుజనా ఫోరం మాల్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తోంది. కాగా.. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెకు మామిడిపూడి వెంకటరమణయ్య ఫౌండేషన్‌ ఆశ్రయం కల్పించింది. మనీషా అని పేరు కూడా పెట్టింది. కొద్ది రోజులు అక్కడే ఉండి చదువుకున్న ఆమె ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చింది. మా ఇల్లు అనాథాశ్రమంలో గాదె ఇన్నయ్య పర్యవేక్షణలో డిగ్రీ పూర్తి చేసింది.

గాదె ఇన్నయ్య, పుష్పరాణి దంపతులు తమ ఆశ్రమంలోనే పెరిగి పెద్దదైన మనీషాకు ఉద్యోగం కూడా కల్పించారు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ఆమెకు అపోలో ఆస్పత్రిలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న లీలాకృష్ణ సాయితో పరిచయం ఏర్పడింది. ఆమెకు నా అనేవారెవరూ లేరని అతడు తెలుసుకున్నాడు. మనీషాను మనువాడేందుకు నిశ్చయించుకున్నాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించాడు. గాదె ఇన్నయ్య దంపతులు మనీషా తల్లిదండ్రుల పాత్ర పోషించారు. ఈ నెల 24న లీలాకృష్ణసాయితో వివాహం జరిపించారు. వచ్చే నెల 3న సంజీవయ్య పార్కు సమీపంలోని వండర్‌లా పార్కులో నూతన వధూవరుల రిసెప్షన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గాదె ఇన్నయ్య తెలిపారు. స్వశక్తితో జీవనం సాగిస్తూ తన జీవిత భాగస్వామిని ఎంచుకొని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకున్న మనీషాను, అనాథ యువతికి అండగా నిలిచిన లీలాకృష్ణసాయిలను పలువురు అభినందిస్తున్నారు. మానవతా దృక్పథంతో మనీషాను తమ ఇంటి కోడలిగా చేసుకున్న సాయి తల్లిదండ్రులపై సైతంపొగడ్తల జల్లు కురుస్తోంది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీజేపీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి

గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ రిలీఫ్

వేధింపులతో పాలిటెక్నిక్‌ విద్యార్థిని ఆత్మహత్య..!

అమీన్‌పూర్‌కు పండుగ రోజు

లీజు చుక్‌..చుక్‌..

ఓటీపీ చెబితే డాక్యుమెంట్లు!

ఐటీజోన్‌లో జెయింట్‌ ఫ్లైఓవర్‌ నేడే ప్రారంభం

కంప్యూటర్‌ దెబ్బకు పాతదైపోయిన టైప్‌ రైటర్‌

మందుల్లేవ్‌..వైద్యం ఎలా?

పర్వతాన్ని అధిరోహించిన దివ్యాంగుడు

అమెరికా ఎన్నికల్లో తెలుగు వ్యక్తి పోటీ

‘హైదరాబాద్‌లో ఉండడానికి కారణమిదే’

బైక్‌పై రూ.20 వేలకు పైగా పెండింగ్‌ చలాన్లు

సీఎం కేసీఆర్‌ నూతన ఇంటి గడప ప్రతిష్ట

విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు పోలీసుల భరోసా..

పల్లెకో ట్రాక్టర్, డోజర్‌

ఆర్టీసీ సమ్మె : ప్రభుత్వ తీరుతో ఆగిన మరో గుండె

కాలువలో ఎమ్మెల్యే పీఏ గల్లంతు 

దేవులపల్లి అమర్‌ బాధ్యతల స్వీకరణ

ఉన్నత విద్యలో అధ్యాపకులేరీ?

సీఎం ‘ఆఫర్‌’ను అంగీకరించండి

ఉద్రిక్తతల మధ్య కండక్టర్‌ అంతిమయాత్ర

స్వల్ప సంఖ్యలో విధుల్లో చేరిన కార్మికులు

ఈసీల్లేవు..వీసీల్లేరు!

యూరప్‌కు తెలంగాణ వేరుశనగ విత్తనాలు

కాలుష్యంతో వ్యాధుల ముప్పు

70 వేల కోట్లకు లైఫ్‌ సైన్సెస్, ఫార్మా! 

ప్రకృతి వైద్యంతోనే ఆరోగ్యం

పదోన్నతి...జీతానికి కోతే గతి

ఎజెండా రెడీ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అక్కడ జాగ్రత్త పడుంటే బిగ్‌బాస్‌ హిట్‌ అయ్యేదే..!

ఆ పాత్రలో ఒదిగిపోయిన మున్నాభాయ్‌

సినిమాల్లోకి స్టార్‌ హీరో సోదరి ఎంట్రీ!

బిగ్‌బాస్‌: రాహుల్‌ గెలుపునకు కారణాలివే..

వయొలెన్స్‌ కావాలన్నారుగా.. : నాని

బిగ్‌బాస్‌ : ‘మిడిల్‌ క్లాస్‌ వ్యక్తిని గెలిపించారు’