పోలీసులు వస్తున్నారని భవనం పైనుంచి దూకి..

19 Sep, 2019 02:51 IST|Sakshi
ప్రవీణ్‌ (ఫైల్‌)

జూదం ఆడుతున్న ఓ యువకుడు మృతి..మరొకరికి గాయాలు

అసలు రైడ్‌ చేయలేదంటున్న పోలీసులు

కేపీహెచ్‌బీ కాలనీ: జూదం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జూదం ఆడుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు వస్తున్నారంటూ అరుపులు వినిపించడంతో గదిలో ఉన్న యువకులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు. కొందరు మొదటి అంతస్తు నుంచి దూకగా, మరికొందరు రెండవ అంతస్తు నుంచి దూకారు. ఇందులో ఓ యువకుడు రోడ్డుపైకి దూకడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మూసాపేట జనతానగర్‌లో నివాసం ఉండే మల్లేష్, లక్ష్మిలకు ఇద్దరు కొడుకులు, ఒక్క కుమార్తె. వీరిలో పెద్దకొడుకు ప్రవీణ్‌ అలియాస్‌ స్వామి(26) ఎంబీఏ వరకూ చదువుకుని ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం ప్రవీణ్‌ స్థానికంగా ఉన్న మరికొందరు స్నేహితులతో కలసి ఓ యువజన నాయకుడి ఇంటి రెండవ అంతస్తులోని గదికి వెళ్లారు.

అక్కడ కొందరు పత్తాలాడుతుండగా మరికొందరు వారితో ముచ్చటిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎస్‌వోటీ పోలీసులు వచ్చారన్న అరుపులు విన్న గదిలోని యువకులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు. కొందరు మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి పరుగులు పెట్టగా, రెండవ అంతస్తులోనే ఉన్న ప్రవీణ్‌కు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో అక్కడ్నుంచి కిందకు దూకాడు. దీంతో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాంతారావు అనే మరో యువకుడు సైతం పక్క భవనంపైకి దూకడంతో అతని కాలుకు తీవ్రగాయాలైనట్లు తెలిసింది. అయితే, అతని ఆచూకీ కూడా తెలియడంలేదు.

విషయం తెలుసుకున్న కూకట్‌పల్లి పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ప్రవీణ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఎస్‌వోటీ పోలీసులు రైడ్‌కు వెళ్లలేదని, అలాంటి సమాచారం తమకు లేదంటున్నారు కూకట్‌పల్లి పోలీసులు. పోలీసులు వస్తున్నారన్న పుకార్లతోనే యువకులు భయాందోళనకు గురై భవనంపై నుంచి దూకి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. స్థానికులు మాత్రం సివిల్‌ దుస్తుల్లో ఉన్న వ్యక్తులు ఆ భవనం వద్దకు వచ్చిన తరువాతే అలజడి నెలకొందంటున్నారు. మృతిచెందిన ప్రవీణ్‌ తమ్ముడు క్రాంతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాంగ్రెస్‌ మునిగిపోతున్న టైటానిక్‌: రాజగోపాల్‌ 

అర్హులను గుర్తిస్తున్నాం..

కసరత్తు షురూ.. త్వరలో కొత్త రెవెన్యూ చట్టం!

హుజూర్‌నగరం.. గరం!

ఐటీ ఉద్యోగులకు త్వరలో బీఆర్టీఎస్‌ సౌకర్యం 

విద్యా శాఖతో ఆటలు!

మెడికల్‌ టూరిజం కేంద్రంగా హైదరాబాద్‌ 

తెలంగాణలో వాణిజ్య అనుకూల వాతావరణం 

సిటీ.. చుట్టూ ఐటీ...

కల్తీ లేని సరుకులు, కూరగాయలు - సీఎం కేసీఆర్‌

31,000 పోస్టులు.. 900 కేసులు- హరీశ్‌రావు

నల్లని మబ్బు చల్లని కబురేనా?

మానవ రవాణా కేసు ఎన్‌ఐఏకు బదిలీ

ఈనాటి ముఖ్యాంశాలు

అలా చేయడం.. పెళ్లి లేకుండా సహజీవనమే

టికెట్‌ వార్‌: ఉత్తమ్‌ వర్సెస్‌ రేవంత్‌

ప్రజల సహకారంతోనే జపాన్‌, సింగపూర్‌ అభివృద్ధి..

ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టినప్పుడే: డీజీపీ

'ప్రభుత్వ జీవోలను వెబ్‌సైట్లలో ఉంచాలి'

కళ్లలో కారం కొట్టి.. మారణాయుధాలతో దాడి

తొలి దశలోనే క్యాన్సర్‌ను గుర్తించే 'జాకెట్‌'

విషాదం : విద్యుత్‌షాక్‌తో దంపతుల మృతి

తమాషా చేస్తున్నారా? - కలెక్టర్‌ ఆగ్రహం

మాకో వైన్స్‌ కావాలి..! 

ఈ సర్కార్‌ నౌకరీ మాకొద్దు! 

భీం ధామం అద్భుతం..!

‘ప్రణయ్‌ పేరుతో నిరభ్యంతర చట్టం’

ఆంక్షలు లేవ్‌, ప్రజావాణికి ఎవరైనా రావొచ్చు

అధికంగా వసూలు చేస్తే సీజ్‌ చేస్తా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రైతు పాత్రలో...

ఆస్కార్‌ బరిలో మోతీ భాగ్‌

‘ఇలాంటి సినిమాలకు డబ్బులుంటే సరిపోదు’

ఇప్పుడు విలన్‌గా ఎందుకు అన్నారు : వరుణ్‌

విఘ్నేష్‌కు నయనతార భారీ కానుక

పెళ్లైన విషయం మర్చిపోయిన నటి