మద్యానికి డబ్బులు ఇవ్వలేదని..

23 Oct, 2019 08:52 IST|Sakshi
బీరుసీసాతో గొంతు కోసుకున్న లింగాల శ్రీను

బీరుసీసాతో గొంతులో పొడుచుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం

పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు

హాలియా పట్టణంలో ఘటన

హాలియా (నాగార్జునసాగర్‌) : మద్యం మత్తులో ఓ యువకుడు విచక్షణ కోల్పోయాడు. తన తల్లి మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో మనస్తాపానికి గురై బీరుసీసాను పగులగొట్టి  గొంతులో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హాలియా పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలి పిన వివరాల ప్రకారం.. హాలియా పట్టణానికి చెందిన లింగాల లక్ష్మమ్మకు భర్త లేకపోవడంతో  కుమారుడు లింగాల శ్రీను(30)తో కలిసి ఓ హోటల్‌ నడుపుతూ జీవనం సాగిస్తోంది.  శ్రీను ఏ పని చేయకుండా జూలాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగి వస్తూ తల్లితో  ఘర్షణ పడుతుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తన తల్లిని డబ్బులు అడుగగా ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఇంటి నుంచి రోడ్డు వద్దకు వెళ్లి  బీరుసీసాను పగలగొట్టి తన గొంతులో పొడుచుకున్నాడు. గమనించిన స్థానికులు అడ్డుకోబోగా వారిని బీరుసీసాతో భయబ్రాంతులకు గురిచేశాడు. మరి కొంత మంది యువకులు ధైర్యంతో ముందుకు వెళ్లి అతని చేతిలో ఉన్న బీరుసీసాను తీసివేశారు. అప్పటికే తన గొంతులో బీరుసీసాతో పొడుచుకోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగిం ది. విషయం తెలుసుకున్న హాలియా ఎస్‌ఐ వీర రాఘవులు సిబ్బందితో ఘటన స్థలం వద్దకు వచ్చి 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం నల్లగొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడినుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించండి

జ్యుడీషియల్‌ కస్టడీకి నర్సింహారెడ్డి

‘వజ్రాలను’ అమ్మేద్దాం!

మళ్లీ ఎర్ర బస్సులు!

గాయత్రి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్‌

సిద్దిపేట అడిషనల్‌ ఎస్పీ నర్సింహారెడ్డి అరెస్ట్‌

హెచ్‌సీయూలో.. అందాల లోకం..

ఈనాటి ముఖ్యాంశాలు

హైదరాబాద్‌లో 19 ఏళ్ల యువతి అదృశ్యం

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ : 50 లక్షలు ఇప్పించండి

నాలుగేళ్లైనా వాళ్లకు టాయ్‌లెట్స్‌ గతిలేవు..!

వైన్స్‌కు కన్నం.. నగదు, మద్యం మాయం!

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

వారిని రేపటిలోగా కోర్టులో హాజరుపరచాలి

ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వండి: ఎన్జీటీ

మంచిగా చెప్తే వినరురా మీరు : మహిళలు

సీఏఏను వెంటనే ఉపసంహరించుకోవాలి!

తెలంగాణ జైళ్ల సంస్కరణలు దేశానికే స్ఫూర్తి: డీజీపీ

సమత కేసు: ఆధారాలు లేవు

లిస్బన్‌ పబ్‌పై పోలీసుల దాడి.. 

కన్నీరు పెట్టిన మంత్రి

వారెవ్వా గోరేమియా..!

రిజిస్ట్రేషన్‌తో పెళ్లికి చట్టబద్ధత

ఓరుగల్లులో మెట్రో పరుగులు!

సోషల్‌ మీడియాపై నిఘా 

హద్దు దాటి కామెంట్‌ చేస్తే కటకటాలే.. 

శిలలపై శిల్పాలు చెక్కాడు

మహిళ ఫిర్యాదుతో సీఐడీ విచారణ

నేటి ముఖ్యాంశాలు..

రిజిస్ట్రేషన్‌ విలువలు పెరగనున్నాయ్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అక్షయ్‌ 2 రజనీ 13 ప్రభాస్‌ 44

పాటతో ప్యాకప్‌

నిన్నే నిన్నే

సంక్రాంతికి రెడీ

అలీకి మాతృవియోగం

ఈ సినిమా నాకు డబుల్‌ స్పెషల్‌