‘టిక్‌టాక్‌’ ఓ మాయ ప్రపంచం

29 Jul, 2019 12:00 IST|Sakshi

‘‘ సమత, దివ్య, విజయలక్ష్మి కరీంనగర్‌ వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగులు. సమత, దివ్య సీనియర్‌ అసిస్టెంట్లు, విజయలక్ష్మి ల్యాబ్‌ అటెండర్‌. వీరు ముగ్గురు కలిసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేసిన వీడియో ఈనెల 26న వైరల్‌ అయ్యింది.ఆడుతూ.. పాడుతూ చిత్రీకరించిన వీడియో గురించి సామాజిక మాద్యమాల్లో చెక్కర్లు కొట్టడంతో జిల్లా వైద్యాధికారి సీరియస్‌ అయ్యారు. ముగ్గురికీ నోటీసులు జారీ చేశారు. విచారణ అనంతరం విధుల్లోంచి తొలగించారు. భవిష్యత్‌లో ఏవరైనా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.’’ 

సాక్షి, జగిత్యాల(కరీంనగర్‌) : టిక్‌టాక్‌... ప్రపంచాన్ని ఊపేస్తున్న మాయా యాప్‌. తమను తాము హీరోలుగా చేసుకునే కలల ప్రపంచం. ఇప్పటి ఆండ్రాయిడ్‌ యుగంలో 70శాతానికి పైగా ఫోన్లలో టిక్‌టాక్‌ యాప్‌ను వినియోగిస్తున్నారు. ఏదోఒక సినిమా పాటకు, సన్నివేశానికి వీడియో చేసి యాప్‌లో అప్‌లోడ్‌ చేసుకున్నారు. ఎక్కువ లైక్‌లు వస్తే.. టిక్‌టాక్‌కు బానిసలవుతున్నారు. కొందరైతే లైక్‌ల కోసంలైఫ్‌నే రిస్క్‌ చేస్తున్నారు. టిక్‌టాక్‌ కారణంతో ఎన్నో సంసారాలు విచ్ఛిన్నమయ్యాయి. చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్లారు. తాజాగా ప్రజాసేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు టిక్‌టాక్‌ ప్రపంచంలో మునిగి తేలడం వైరల్‌ అవుతోంది.రాష్ట్రంలో వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కరీంనగర్‌ వైద్యశాఖలో ముగ్గురు మహిళలు టిక్‌టాక్‌ చేయడం... వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేయడం చర్చనీయాశమైంది. 

టిక్‌టాక్‌ అంటే..? 
చైనాకు చెందిన ఓ కంపెని టిక్‌టాక్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌ల్లో టిక్‌టాక్‌ నాగులోది. తెలుగు రాష్ట్రాల్లో 3కోట్ల మంది టిక్‌టాక్‌ వినియోగిస్తున్నారు. టిక్‌టాక్‌ ద్వారా మనల్ని మనం సరికొత్తగా పరిచయం చేసుకోవచ్చు. సినిమాలోని ఓ పాటకు హీరో, హీరోయిన్లుగా మనమే డ్యాన్స్‌ చేయవచ్చు. సినిమాలోని డైలాగులకు తగ్గట్టుగా నటించొచ్చు. ఇలాంటి సన్నివేశాలను అండ్రాయిడ్‌ ఫోన్‌ ద్వారా రికార్డు చేసి, సెల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న టిక్‌టాక్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది. దీంతో చూసినవారు లైక్‌లు, సందేశాలు, షేర్‌చేయడం చేస్తుంటారు. దీంతో సదరు వీడియో తీసినవారు సంతోషంతో మరిన్ని కామెంట్లు, లైక్‌లకోసం వరుసవీడియోలు తీయడం పరిపాటిగా మారింది. 

రంగురంగులు.. రకరకాలు..
కొందరైతే నటీ,నటులకు తామేమీ తక్కువకాదంటు మేకప్‌లతో సింగారాలు, కొత్త బట్టలు వేసుకుని తమనుతాము ప్రజెంట్‌ చేసుకోవడానికి ప్రయత్నిసుంటారు. ఇంకొందరు రాజకీయనాయకుల వాయిస్‌తో, వారి సన్నివేశాలను చిత్రీకరించి రెండు కలిపి టిక్‌ టాక్‌లో పెడుతున్నారు. చివరకు భర్తతో కలిసి భార్య, భార్యతో కలిసి భర్త, అమ్మా,నాన్న.. పిల్లలు... బంధువులతో టిక్‌టాక్‌లు చేస్తున్నారు. సదరు వీడియోలు..లైక్‌లతో మధురానిభూతి పొందుతున్నామని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నిషేధించాలని..
‘టిక్‌టాక్‌’ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగోతంది. తమిళనాడులోని మధురైకు చెందిన ముత్తుకుమార్‌ అనే న్యాయవాది టిక్‌టాక్‌లో అశ్లీలత పెరగుతోందని, ఆత్మహత్యలకు ఉసిగొల్పుతోందంటూ మద్రాస్‌ హైకోర్టులో పిల్‌దాఖాలు చేశారు. దీంతో టిక్‌టాక్‌ను నిషేధించాలని కేంద్రానికి కోర్టు సూచించింది. సదరు కంపెనీవారు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో తాత్కాలిక అనుమతులు ఇచ్చింది. అయితే టిక్‌ టాక్‌తో దుష్పపరిణామాలే కాకుండా కొన్ని కుటుంబాలు సైతం బాగుపడ్డాయి. తమిళనాడుకు చెందిన భార్యభర్తలు హరిష్, జయప్రదల మధ్య తగాదాలతో మూడేళ్ల క్రితం భర్త ఎటోవెళ్లిపోయాడు. టిక్‌టాక్‌లో భర్త వీడియోలు చూసిన పలువురు భార్యకు చెప్పగా పోలీసుల సహకారంతో దంపతులు ఒక్కటయ్యారు.

బాధ్యతలు మరువొద్దు.. 
ఈ మాయా ప్రపంచానికి బానిసలు కావొద్దని పలువురు సూచిస్తున్నారు. అయితే చదువుకునే యువత.. గృహిణులు.. ఉద్యోగులు.. సెలబ్రెటీలు పగలు..రాత్రి తేడాలేకుండా గంటకోసారి టిక్‌టాక్‌ యాప్‌లో కాలక్షేపం చేస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. కాలక్షేపానికి టిక్‌టాక్‌ వీడియోలు చేసినా.. చూసినా... బాధ్యతులు మరువద్దని పలువురు సూచిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో ఉద్యోగులు విధులు మరిచి టిక్‌టాక్‌లు చేస్తున్నారు. వీడియోలు వైరల్‌ కావడంతో ఉద్యోగాలు సైతం కోల్పోతున్నారు.

వ్యసనం కావొద్దు
టిక్‌టాక్‌ వినోదం వ్యసనంగా మారొద్దు. ఏదో చేయాలి, దాన్ని అందరూ చూడాలనే లక్ష్యంతో చేస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుని అసుపత్రుల పాలవుతున్నారు. టిక్‌టాక్‌తో రోజుకు రెండు, మూడు గంటల విలువైన సమయాన్ని కొంతమంది వృథా చేస్తున్నారు.  
– మల్లారెడ్డి, ఎండీ ఫిజిషియన్‌

యాప్‌కు దూరంగా ఉండాలి
చదువుకుంటున్న యువత టిక్‌టాక్‌కు దూరంగా ఉండటమే మంచిది. విలువైన కాలాన్ని టిక్‌టాక్‌ల పేరిట ఖర్చు చేస్తే, చివరకు జీవితంలో విలువనే లేకుండా మిగిలిపోతారు. ఆండ్రాయిడ్‌ ఫోన్లు అవసరం మేరకే ఉపయోగించాలి. 
– సింధూశర్మ, జగిత్యాల ఎస్పీ

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సందిగ్ధం వీడేనా? 

కిరోసిన్‌ కట్‌

జైపాల్‌రెడ్డి అంత్యక్రియల్లో మార్పు

కమలంలో కోల్డ్‌వార్‌ 

మున్సిపల్‌ ఎన్నికలు జరిగేనా..?

వరంగల్‌లో దళారీ దందా

మెట్రో రూట్లో ఊడిపడుతున్న విడిభాగాలు..

‘నగర’ దరహాసం

పాతబస్తీ పరవశం

టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో గుబులు..

ఎఫ్‌ఎన్‌సీసీలో జిమ్‌ ప్రారంభం

హైదరాబాద్‌లో కాస్ట్‌లీ బ్రాండ్లపై మక్కువ..

తెలంగాణ సంస్కృతి, ఎంతో ఇష్టం

మాజీ ఎంపీ వివేక్‌ పార్టీ మార్పుపై కొత్త ట్విస్ట్‌!

గ్యాస్‌ ఉంటే.. కిరోసిన్‌ కట్‌..!

మరింత కిక్కు..! 

ఉమ్మడి జిల్లాపై ‘జైపాల్‌’ చెరగని ముద్ర 

జైపాల్‌రెడ్డి ఇక లేరు..

గోడపై గుడి చరిత్ర!

చెత్త‘శుద్ధి’లో భేష్‌ 

కృష్ణమ్మ వస్తోంది!

అంత డబ్బు మా దగ్గర్లేదు

లాభం లేకున్నా... నష్టాన్ని భరించలేం!

ఓయూ నుంచి హస్తినకు..

మాదాపూర్‌లో కారు బోల్తా 

20వ తేదీ రాత్రి ఏం జరిగింది?

నిజాయతీ, నిస్వార్థ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది

బేగంపేటలో వింగర్‌ బీభత్సం 

ఆ పుస్తకం.. ఆయన ఆలోచన 

హైదరాబాద్‌ యూటీ కాకుండా అడ్డుకుంది జైపాలే 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా జాక్‌పాట్‌ సూర్యనే!

‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’

నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై