ప్రేమించమంటూ వేధింపులు..

7 Nov, 2015 18:33 IST|Sakshi

బంజారాహిల్స్ (హైదరాబాద్) : ఓ యువకుడు తనను ప్రేమించమంటూ వెంటపడి వేధిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్ రోడ్ నంబర్ -9లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో నివసించే యువతి(22) పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటోంది.

ఆమె ఇంటి పక్కనే నివసించే గాజుల జయమ్మ కొడుకు శివ(23) బలాదూర్‌గా తిరుగుతూ యువతి వెంటపడి ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. ఆమె రాకపోకలపై నిఘా ఉంచసాగాడు. గడిచిన వారం రోజుల నుంచి ఆగడాలు శృతి మించి ఇంటిదాకా వచ్చాయి. పీకలదాకా మద్యం తాగి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించసాగాడు. దీంతో బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు