యువకుడి దారుణ హత్య

28 Oct, 2015 08:44 IST|Sakshi

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నవీపేట మండలం సుభాష్‌నగర్ కాలనీకి చెందిన గంగాధర్(32) మంగళవారం రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చి నిద్రించగా, బుధవారం ఉదయం చూసే సరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

 

మృతుడి తలపై గాయాలు ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు