ఘనంగా జననేత జన్మదిన వేడుకలు 

22 Dec, 2018 01:38 IST|Sakshi

తెలంగాణ వ్యాప్తంగా జగన్‌ పుట్టిన రోజు కార్యక్రమాలు 

కేక్‌లు కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు  

పార్టీ కేంద్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం 

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేతలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తదితరులు భారీ కేక్‌ కట్‌ చేసి జగన్‌కు శుభాకాంక్షలు చెప్పారు. మెగా వైద్య శిబిరం, రక్తదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఆదిలాబాద్‌ టౌన్‌లో కార్యకర్తలు కేక్‌ కట్‌ చేసి అందరికి పంచిపెట్టారు. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలంలో అనాథాశ్రమంలో దుప్పట్లు, పండ్ల పంపిణీ చేశారు. బాన్సువాడ మండలంలో ఆస్పత్రిలోనూ, కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలోనూ రోగులకు పండ్లను పంపిణీ చేసి కేక్‌ కట్‌ చేశారు.

వృద్ధజనాశ్రమంలో పండ్లను అందజేసి కేక్‌ కట్‌ చేశారు. వేములవాడ రాజన్న ఆలయంలో నేతలు ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్‌ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కేక్‌ కట్‌ చేశారు. ఖమ్మం టౌన్‌ సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు, చర్చిలో ప్రార్థనలు, ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ, రక్తదానం జరిగింది. వృద్ధజనాశ్రమంలో వృద్దుల చేత భారీ కేక్‌ను కట్‌ చేయించారు. కోదాడలో ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసి కేక్‌ కట్‌ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేటలోని వృద్ధజనాశ్రమంలో వృద్దులకు పండ్లను అందజేశారు. కేక్‌ను కట్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా పరిగిలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు, పండ్ల పంపిణీ చేశారు. షాద్‌నగర్‌లో కేక్‌ కట్‌ చేశారు. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్, ఎల్‌.బి నగర్, ముషీరాబాద్‌ నియోజకవర్గాలలో కేక్‌ కట్‌చేసి, పండ్ల పంపిణీ చేశారు. అటు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగాను ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయాలలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
 

మరిన్ని వార్తలు