ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్

26 Jul, 2014 03:24 IST|Sakshi
ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్

హైదరాబాద్: రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కో-ఆర్డినేటర్ హెచ్.ఎ. రెహమాన్ ఆధ్వర్యంలో ఇచ్చిన ఇఫ్తార్ విందులో మతసామరస్యం వెల్లివిరిసింది. శుక్రవారం సాయంత్రం కింగ్‌కోఠిలోని ఈడెన్ గార్డెన్‌లో జరిగిన ఇఫ్తార్ విందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.  జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ముస్లిం మత పెద్దలు, హెచ్.ఎ. రెహమాన్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, విజయచందర్, నల్ల సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, ఉర్దూ అకాడమీ మాజీ అధ్యక్షుడు నూరుల్లా ఖాద్రీలు ఈ విందులో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు