పేదోడి గుండెల్లో దేవుడిలా నిలిచిన వైఎస్సార్‌

9 Jul, 2018 11:17 IST|Sakshi
వైఎస్సార్‌ చిత్రపటానికి నివాళులర్పిçస్తున్న శ్రీధర్‌బాబు, ఇతరులు

ఆయన ఆదర్శాలు ముందుకు తీసుకెళ్తాం

మాజీ మంత్రిశ్రీధర్‌బాబు

మంథని: పేదవాడికి ఉపయోగపడే అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి గుండెల్లో దేవుడిగా నిలిచిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కొనియాడారు. వైఎస్సార్‌ 69 వ జయంతి సంందర్భంగా మంథనిలోని ఆయన నివాసంలో వైఎస్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకుడిగా గొప్ప నాయకత్వాన్ని ప్రదర్శించారని, దేశంలో గొప్పవ్యక్తిగా పేరుపొందారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పేద విద్యార్థులంతా నేడు ఉన్నత చదువులు చదువుతున్నారంటే ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం చలవే అన్నారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో శాతావాహన యూనివర్శిటీ, శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్‌మానేరుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిచ్చిన మహానాయకుడన్నారు. మంథని నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని గుర్తు చేశారు. మంథనికి జేఎన్టీయూ కళాశాల, డిగ్రీ కళాశాలలో సైన్స్‌ విభాగం, మహదేవపూర్‌లో డిగ్రీ, పాలిటెక్నిక్‌ కశాశాలలు, ఐటీఐ కళాశాలతో పాటు అనేక రకాల ప్రొత్సాహం అందించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, టూ టీఎంసీ నిర్మాణాలకు 2008 శ్రీకారం చుట్టి సాగునీటి సమస్యకు సహకరించారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, నాయకులు సెగ్గెం రాజేశ్, మంథని సత్యం, ఆజీంఖాన్, పోలు శివ, గోటికార్‌ కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు