పోడుభూములకు పట్టాలిచ్చిన ఘనత వైఎస్సార్‌దే..

9 Apr, 2019 18:54 IST|Sakshi
మాట్లాడుతున్న కాంగ్రెస్‌  అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌

కాంగ్రెస్‌ హయాంలోనే పేదలకు న్యాయం

మానుకోటలో గెలుపు ఖాయం

కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాం నాయక్‌

మహబూబాబాద్‌: పోడు భూములకు పట్టాలు ఇచ్చి ఆదుకున్న ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిదేనని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ హయాం లోనే పేదలకు న్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసి రు ణం తీర్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

కేంద్ర మంత్రిగా చేసిన సమయంలో రైళ్ల హాల్టింగ్‌లు, విద్య పరంగా మోడల్‌ స్కూ ల్స్, కురవి మండల ఏకలవ్య పాఠశాల మం జూరీ మానుకోట మునిసిపాలిటీగా చేయడంతో పాటు రోడ్ల పరంగా కోట్లాది రూపాయలతో ఎంతో అభవృద్ధి చేశామన్నారు. తన గెలుపు కోసం పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి, డోర్నకల్‌ ఇన్‌చార్జి రాంచంద్రునాయక్, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య ఎంతో కృషి చేస్తున్నారన్నారు. నాయకులు అయ్యప్పరెడ్డి, కత్తి స్వామి, బానోత్‌ ప్రసాద్, నూనావత్‌ రమేష్, హెచ్‌.వెంకటేశ్వర్లు, పెండ్యా   శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు