పథకాల ప్రారంభం రోజునే..

8 Jul, 2020 07:56 IST|Sakshi

వైఎస్‌ చేతుల మీదుగా లబ్ధిపొందిన మండల పేదలు

సేవలు గుర్తుకు తెచ్చుకుంటున్న పేదలు 

నేడు వైఎస్సార్‌ జయంతి

బొంరాస్‌పేట: ‘పేదల దేవుడి’గా పాలనను అందించి నిరుపేదలకు ఆరోగ్యశ్రీతో ప్రాణాలు పోసి, కూలీలకు భూములిచ్చి రైతులను చేసిన పుణ్యాత్ముడు’.. అంటూ  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిని తలచుకుంటున్నారు. స్వయానా వైఎస్‌నుకలిసి లబ్ధిని అందుకున్న మండలంలోని పలువురు లబ్ధిదారులు తమజ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. రాజన్న అమలు చేసిన పథకాల్లో లబ్ధిపొందిన వారంతా జయంతి సందర్భంగా యాది  చేసుకుని కన్నీరుకారుస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, స్థానిక నాయకుల స్వార్థం వల్ల పథకాలకు దూరంగా ఉన్న అర్హులు నేరుగా అప్పట్లో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కలిసి మొర పెట్టుకొని లబ్ధిపొందినవారు మండలంలో చాలామంది ఉన్నారు. 

వైఎస్సార్‌ జ్ఞాపకాలు పదిలం
ముఖ్యమంత్రి సహాయనిధి కింద కాకర్లగండితండా దేవులానాయక్‌కు రూ. 60వేలు, ఏర్పుమళ్ల బొర్రసుభాన్‌ రూ.40వేలు, అనంతమ్మకు పదివేలు,  ఈర్లపల్లితండాకు మాణిక్యనాయక్‌ రూ.30వేలు, దుద్యాల సోమ్ల నాయక్‌తండా సుశీలాబాయి రూ.25వేలు, రేగడిమైలారంలో ఫసులోది లాలమ్మలతోపాటు నేరుగా కలిసిన మండల పేదలకు వివిధ పథకాల్లో వైఎస్‌ లేఖతో రూ. 10లక్షలకుపైగా మండల ప్రజలకు అందాయి. 

పథకాల ప్రారంభం రోజునే..
ఉమ్మడిరాష్ట్రంలో మహిళా సంఘాలకు అభయహస్తం ప్రారంభంరోజే ఫిబ్రవరి 5న ప్రారంభించిన రోజే మండలానికి చెందిన హకీంపేట కిష్టమ్మ  వైఎస్సార్‌ చేతులమీదు మొట్టమొదటి చెక్కును అందుకొని మండల ప్రజలు గర్వించేలా చేశారు. మరుసటిరోజు మంత్రులు, జిల్లా అధికారులతో మండలానికి చెందిన మరో మహిళా చెక్కు అందుకొని సంతోషపడ్డారు. కొత్తూరులో భూ పంపిణీ పట్టాలను నేరుగా వైఎస్సార్‌ చేతుల మీదుగా అందుకున్న దళితులున్నారు. వారు గత అనుభవాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వైఎస్‌ను తలచుకొంటున్నారు.

ఎవరూ చేయలేని మేలు
ముఖ్యవుంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా పింఛను తీసుకొనే భాగ్యం అప్పట్లో జిల్లాలో నాకు ఒక్కదానికే కలిగింది. ముసలితనమెుచ్చి ఎటాŠల్‌ బతుకీడ్వాలో.. అనుకున్నదాన్ని. అనుకోకుండా అభయహస్తం పథకం పెట్టడం, అందులో మొదట లబ్ధిపొందాను. అలాంటి మహనీయుడు మళ్లీరావాలని దినాం యాదిచేసుకుంటున్నా.– చాకలి కిష్టమ్మ అభయహస్తం లబ్ధిదారు, హకీంపేట

పెద్దాయన చేసిన సాయం మరువలేనిది
నా భర్త ప్రమాదవశాత్తు చనిపోతే ఎవరూ నాకు న్యాయం చేయలేదు. నేరుగా ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లాలని ధైర్యం తెచ్చుకొని వెళ్లాను. రాజశేఖరరెడ్డితో నా గోడు చెప్పుకున్నా. రూ. 55వేలు సహాయానికి జిల్లా కలెక్టరుకు లేఖ రాశారు. రూ. 5వేలు నేరుగా ఇచ్చారు. ఏ దిక్కులేని నాకు సాయం చేసి నా జీవితానికి ధైర్యమిచ్చిండు.– లాలమ్మ, ముఖ్యమంత్రి సహాయనిధి లబ్దిదారు

ఊరి పెద్దగా పలకరించారు
గ్రామంలో ప్రజలు సమస్యలు విన్నవిస్తే పెడచెవిన పెట్టి పట్టించుకోని నాయకులున్నారు. కాని నేను 2008లో పెద్ద మనిషి ఆఫీసుకు వెళ్లినప్పుడు ఆప్యాయంగా మాట్లాడి సహాయంచేసిండు. రాజ్యాన్ని పాలిచేరాజు చిన్నపల్లె మనిషిని పలకరించి మాఊరి పెద్దాయనగా పలకరించారు.–  అంజిలయ్య, వైఎస్‌ అభిమాని, రేగడిమైలారం

మరిన్ని వార్తలు